ఇంటర్ విద్యార్థిని మృతదేహాన్ని... గుట్టుగా తరలిస్తూ పట్టుబడ్డ కుటుంబసభ్యులు

Arun Kumar P   | Asianet News
Published : Jun 19, 2021, 08:14 AM ISTUpdated : Jun 19, 2021, 08:18 AM IST
ఇంటర్ విద్యార్థిని మృతదేహాన్ని... గుట్టుగా తరలిస్తూ పట్టుబడ్డ కుటుంబసభ్యులు

సారాంశం

ఆత్మహత్య చేసుకున్న యువతి యువతి మృతదేహాన్ని కుటుంబసభ్యులే రహస్యంగా తరలించడానికి ప్రయత్నించి స్థానికులకు దొరికిపోయారు

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని నులకపేటలో ఇంటర్మీడియట్ విద్యార్థిని ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అయితే కుటుంబసభ్యులు ఈ విషయాన్ని రహస్యంగా వుంచి యువతి మృతదేహాన్ని అక్కడినుండి తరలించడానికి ప్రయత్నించి స్థానికులకు దొరికిపోయారు. దీంతో యువతి ఆత్మహత్యపై పలు అనుమానాలు రేకెత్తాయి.   

వివరాల్లోకి వెళితే... తాడేపల్లి నులకపేటలో కుటుంబంతో కలిసి నివాసముండే సౌజన్య(16) విజయవాడ గాంధీ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఏమయ్యిందో తెలీదు కానీ శుక్రవారం అర్థరాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

read more  కోరిక తీర్చాలని బలవంతం: యువతిని చంపిన ప్రేమోన్మాది

అయితే సౌజన్య మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు కుటుంబసభ్యులు సిద్దపడ్డారు. దీన్ని గుర్తించిన స్థానికులు యువతి మృతదేహాన్ని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసిన తాడేపల్లి పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. 
 

PREV
click me!

Recommended Stories

తిరుపతి గోవింద రాజ స్వామి ఆలయంలో జరిగిన ఘటనపై Bhumana Karunakar Reddy Reaction | Asianet News Telugu
తిరుపతిలో మరోసారి భద్రతా లోపం: ఆలయ రాజగోపురం ఎక్కి రచ్చ చేసిన మందుబాబు