దొంగలకు అడ్డాగా ఏపీ సీఎంఓ... సిబిఐ విచారణ చేయించాలి : వర్ల రామయ్య డిమాండ్

Published : Aug 04, 2023, 05:20 PM IST
దొంగలకు అడ్డాగా ఏపీ సీఎంఓ... సిబిఐ విచారణ చేయించాలి : వర్ల రామయ్య డిమాండ్

సారాంశం

ఏపీ ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారులకు తెలియకుండానే సీఎంఓ లో కీలకమైన పైళ్లు క్లియర్ కావడం ఏమిటని వర్ల రామయ్య అన్నారు. 

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం అవినీతిపరులు, దొంగలతో నిండిపోయిందని టిడిపి నేత వర్ల రామయ్య అన్నారు. ముఖ్యమంత్రి, సీఎంఓ లోని ఉన్నతాధికారులకు తెలియకుండానే కిందిస్థాయి ఉద్యోగులు ఫైల్స్ క్లియర్ చేయడం వెలుగులోకి వచ్చిందన్నారు. అధికారులు డిజిటల్ సంతకాలతో లాగిన అవుతున్న కింది స్థాయి ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేయడం సిగ్గుచేటని అన్నారు. ఉన్నతాధికారులకు తెలియకుండా, ఫైల్స్ సిఎం సంతకంతో ఆమోదం పొందకుండా, క్రిందిస్థాయి ఉద్యోగస్తులు ఆ ఫైల్స్ ఎలా క్లియర్ చేస్తారు? అని రామయ్య ప్రశ్నించారు. 

ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రికి తెలిసే దొంగ డిజిటల్ సంతకాలతో లాగిన్ అయ్యారు... ఇది ముమ్మాటికీ దురుద్దేశంతోనే జరిగిందని రామయ్య అన్నారు. ఉన్నతాధికారులను అరెస్టు చేయకుండా క్రిందిస్థాయి ఉద్యోగస్తులను తూతూ మంత్రంగా అరెస్టు చేయడం సరైనది కాదన్నారు. సిఎంఓ లో వసూల్ రాజా,మిస్టర్ 20% కు తెలియకుండా ఏ ఫైల్ ముందుకు నడవదు... అంతా ఆయన కనుసన్నల్లోనే నడుస్తుందన్నారు. వసూల్ రాజా అవినీతి సంపాదనపై దర్యాప్తు చేయడం కోసం ఇద్దరు రిటైర్డ్ పోలీసు అధికారులను టిడిపి నియమించిందని రామయ్య తెలిపారు.

సీఎంఓ లోని వసూల్ రాజాకి సంబంధించిన అవినీతి భాగోతం త్వరలోనే బయటపెడతామని రామయ్య అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో పూనమల్లి హైవేలో ఆయన కొన్న భూములు, బెంగళూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో బినామీల పేరిట కొన్న ఆస్తుల వివరాలను సేకరిస్తున్నామని రామయ్య అన్నారు.

Read More  మీ కుటుంబానికి అందిన సంక్షేమ పథకాలివే..: టిడిపి నేతతో వైసిపి ఎమ్మెల్యే ఆసక్తికర సంభాషణ (వీడియో) 

సిఎంఓ ప్రమేయం లేకుండా దొంగతనంగా క్లియర్ చేసిన ఫైళ్ల వివరాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రామయ్య డిమాండ్ చేసారు. అవినీతి సామ్రాట్, వసూల్ రాజా, మిస్టర్ 20% గా పేరుగాంచిన అధికారిని సిఎంఓ నుంచి ముఖ్యమంత్రి తరిమి కొట్టాలని అన్నారు. ముఖ్యమంత్రికి ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేసారు. సిఎంఓ లో జరిగిన అవినీతి బాగోతంపై సిబిఐతో దర్యాప్తు చేయించాలన్నారు. సిఎంఓలో అవినీతి సూత్రధారిగా చెప్పబడుతున్న మామ ఎవరు? ఎవరికి మామ? ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలని వర్ల రామయ్య డిమాండ్ చేసారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu
IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే