రాజకీయాలు నడిపేందుకు సినిమాలే నాకు ఇంధనం: పవన్ కళ్యాణ్

By narsimha lodeFirst Published Aug 4, 2023, 5:14 PM IST
Highlights

సినిమాను రాజకీయాల్లోకి తీసుకు రావద్దని  జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

అమరావతి:  రాజకీయాలు నడిపేందుకు  తనకు  సినిమాలే ఇంధనమని  జనసేన  చీఫ్ పవన్ కళ్యాణ్  వ్యాఖ్యానించారు. శుక్రవారంనాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో  ఏర్పాటు చేసిన సమయంలో  పవన్ కళ్యాణ్ మాట్లాడారు.  రాజకీయాల్లోకి సినిమాను తీసుకు రావద్దని  కోరారు.  ఇష్యూని డైవర్ట్ చేసేందుకు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు.  తనను తిట్టినా  ఏం కాదన్నారు.   తన చుట్టూ తిరిగితే  మీ సమయం వృధా అని  ఆయన  పార్టీ నేతలకు  చురకలంటించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే  నాయకులు అవుతారన్నారు.

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని  సంకేతాలు కన్పిస్తున్నాయన్నారు. ఎన్నికల ఏడాదిలో ఉన్నందున  పార్టీ క్యాడర్  రానున్న రోజుల్లో మరింత బాధ్యతగా ఉండాలని ఆయన కోరారు.   పార్టీ నేతలకు  జవాబుదారీతనం,  త్యాగం, బాధ్యత ఉండాలని ఆయన  సూచించారు.  భవిష్యత్తు తరాల గురించి  ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.ఈ తరహా ఆలోచన చేసే నేతలు ఇతర పార్టీల నుండి వచ్చినా  చేర్చుకుంటామన్నారు.భయపెట్టడం, బెదిరించడమే  వైసీపీ లక్ష్యంగా కన్పిస్తుందని  పవన్ కళ్యాణ్  విమర్శించారు. 
   
   పవన్ కళ్యాణ్ నటించిన  సినిమా బ్రోలో  మంత్రి అంబటి రాంబాబు పోలిన పాత్ర ఉందనే విషయమై  ఏపీ రాజకీయాల్లో  కలకలం  రేపుతుంది.  ఈ పాత్ర మంత్రి అంబటి రాంబాబునుద్దేశించి కాదని  సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే  ఈ పాత్ర తననుద్దేశించి చేసిందని  మంత్రి అంబటి రాంబాబు  చెప్పారు.  ఈ సినిమాకు వచ్చిన డబ్బులు  ఎక్కడి నుండి వచ్చాయని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు.  

also read:చంద్రబాబును ఎందుకు సీఎం చేయాలో చెప్పాలి: పవన్ పై పోసాని ఫైర్

టీడీపీ నేతలు అమెరికా నుండి  తెచ్చిన డబ్బులను  నిర్మాత  ప్రసాద్ ద్వారా పవన్ కళ్యాణ్ కు  అందించారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. ఈ విషయమై దర్యాప్తు సంస్థలకు  ఫిర్యాదు  చేస్తామన్నారు. అంతేకాదు  పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా  MRO అనే పేరుతో సినిమా తీస్తానని  మంత్రి ప్రకటించారు. మరో వైపు  మంత్రి తీసే సినిమాకు వ్యతిరేకంగా SSS  అనే సినిమాను తీస్తామని జనసేన తిరుపతి నేతలు ప్రకటించారు.   మరోవైపు వెబ్ సీరీస్ ను తీసేందుకు కొన్ని పేర్లను కూడ పరిశీస్తున్నట్టుగా జనసేన నేత పోతిన మహేష్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

  

click me!