పెళ్లిలో కూడ అమరావతి నినాదం: కొత్త జంట చేతిలో రాజధాని ప్లకార్డులు

Published : Feb 26, 2020, 04:27 PM IST
పెళ్లిలో కూడ అమరావతి నినాదం: కొత్త జంట చేతిలో రాజధాని ప్లకార్డులు

సారాంశం

అమరావతి కోసం రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. తుళ్లూరులో ఓ వివాహ వేడుకలో  జై అమరావతి అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. 


అమరావతి:రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ  29 గ్రామాల ప్రజలు 71 రోజులుగా పైగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఏ పని చేసినా కూడ  అమరావతి అంశాన్ని  మాత్రం  వదలడం లేదు.  తాజాగా ఓ పెళ్లి వేడుకలో నూతన వధూవరులు 'జై అమరావతి' అంటూ ప్లకార్డులు  ప్రదర్శించారు. 

also read:సేవ్ అమరావతి: పెళ్లి పత్రికపై సురేష్ వినూత్న ప్రచారం

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు కోసం సానుకూలంగా ఉంది. అమరావతిలోనే  రాజధానిని కొనసాగించాలని  రైతులు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో  బుధవారం నాడు జరిగిన పెళ్లిలో   జై అమరావతి  ప్ల కార్డులు ప్రదర్శించారు.

also read:పుష్పక విమానంలో దిగిన వధూవరులు: విజయవాడలో వెరైటీ పెళ్లి వేడుక

పెళ్లి జరిగిన తర్వాత నూతన వధూవరులు  జై అమరావతి అంటూ ముద్రించిన ప్ల కార్డులు  ప్రదర్శించారు. పెళ్లికి హాజరైన బంధు మిత్రులు కూడ  జై  అమరావతి అన్న ప్ల కార్డులు ప్రదర్శించారు.  జై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

also read:కర్ణాటకలో వెరైటీ పెళ్లి పత్రిక: హల్ టిక్కెట్టు నమూనాలో వెడ్డింగ్ కార్డు

ఇటీవలనే  కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామంలో జాస్తి సురేష్ తన పెళ్లి పత్రికను వెరైటీగా తయారు చేయించాడు. సేవ్ అమరాతి అని ముద్రించిన పెళ్లి పత్రికలను ముద్రించి బంధు మిత్రులకు పంచాడు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!