మరో వ్యక్తితో నిశ్చితార్థం: ప్రియుడిని చంపేసి డ్రామాలాడిన యువతి

By telugu teamFirst Published Feb 26, 2020, 1:13 PM IST
Highlights

తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని కడపలో ఓ యువతి హతమార్చింది. తన పెళ్లికి అడ్డువస్తాడనే భయంతో ఆమె అతన్ని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది.

కడప: తన పెళ్లికి అడ్డు వస్తున్నాడనే కోపంతో ఓ యువతి ప్రియుడిని హతమార్చింది. ఈ సంఘటన కడప చిన్న చౌకు పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అతన్ని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. అయితే, పోలీసులకు అడ్డంగా దొరికింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు యువతికి ఎవరైనా సహకరించి ఉంటే వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కడప జిల్లా సిద్ధవటం మండలం టక్కోలి గ్రామ హరిజనవాడుకు చెందన సాల శ్రీనివాసులు (29)కు అదే ప్రాంతానికి చెందిన సుమతితో రెండేళ్ల కిందట పెళ్లయింది. శ్రీనివాసులు కడపలోని ఓ నర్సింగ్ హోంలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తన్నాడు. వీరికి 11 నెలల కుమారుడు కూడా ఉన్నాడు. అదే నర్సింగ్ హోంలో పనిచేస్తున్న ఓ యువతితో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. 

ఆమె వేరే వ్యక్తులతో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుందని శ్రీనివాసులుకు అనుమానం ఉండేది. దాంతో ఇరువురి మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఆరు రోజుల క్రితం ఆమెకు కడపకు చెందన ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. దాంతో ఇరువురి మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. వేరే పెళ్లి చేసుకుంటే చచ్చిపోతానని శ్రీనివాసులు ఆమె బెదిరిస్తూ వచ్చాడు. 

తన పెళ్లికి అతను అడ్డువస్తాడనే అనుమానంతో అతన్ని అడ్డు తొలగించుకునేందుకు యువతి పథకం రచించింది. సోమవారం ఉదయం 9 గటలకు శ్రీనివాసులు ఎప్పటిలాగే విధులకు వచ్చాడు. ఆ రాత్రి మళ్లీ ఇరువురికి మధ్య గొడవ జరిగింది. తనను కాదని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే చచ్చిపోతానని బెదిరించాడు. దాంతో శ్రీనివాసులు మెడకు చీర బిగించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాలని ప్రయత్నించింది. 

మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టి బంధువులకు తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో ఆస్పత్రి సిబ్బందికి ఫోన్ చేసి శ్రీనివాసులు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. అతని భార్య, తల్లిదందడ్రులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న సీఐ ఆశోక్ రెడ్డి, ఎస్సై రోషన్ సిబ్బందితో అక్కడికి వచ్చారు. 

అనుమానం రావడంతో పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేశారు. చివరకు హత్యగా తేల్చారు. రాత్రి 12.30 నుంచి 2 గంటల వరకు సీటీ టీవీ కెమెరాలు ఆప్ చేయడంతో ఈ మధ్య సమయంలో హత్య జరిగి ఉంటుందని అనుమానించారు. మృతుని భార్య సుమతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుజనపై హత్య కేసు నమోదు చేశారు. 

యువతి ఒక్కతే హత్య చేయడం సాధ్యం కాదని, అందువల్ల ఆమె ఎవరి సహకారమైన తీసుకుందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

click me!