తుఫాన్ సహాయ చర్యల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

Published : Dec 12, 2016, 04:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:51 PM IST
తుఫాన్  సహాయ చర్యల్లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి

సారాంశం

స్థానిక ప్రజల ఫోన్ కాల్స్ కు స్పందించి సహాయ చర్యల్లోకి దుమికిన  నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి



నెల్లూరు లోని ని 23 వ డివిజన్ జనశక్తి నగర్ తుఫాన్ ముంచేసింది. వర్దా దెబ్బకి కాలనీలో పెద్ద ఎత్తున నీళ్లుచేరి  30 కుటుంబాలు  జలమయం అయ్యాయి.   హాఠాత్తుగా కాలనీ జలమయం కావడంతో వారిని అదుకునేందుకు ఎవరూ అందుబాటులో లేకపోయారు.దీనితో కాలనీవాసులు గుర్తొచ్చిన వ్యక్తి రూరల్ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డియే . అందుకే    కోటం  శ్రీధర్ రెడ్డి కి ఫోన్ ద్వారా పరిస్థితి వివరించారు. వెంటనే తమ కాలనీకి వచ్చి, పరిస్థితి చేజార కుండా చూడాలని   వారు  కోరారు.

 

శ్రీధర్ రెడ్డి హుటాహుటిన జనశక్తి నగర్ బయలు దేరారు.  రెవిన్యూ, కార్పొరేషన్  అధికారులను  వెంటబెట్టుకొని  వెంటనే అప్రమత్తం చేసిన వారితో ప్రాంతానికి చేరుకొన్నారు. గండ్లు కొట్టి నీళ్లు బయటకి పంపించారు. దాదాపు 2 గంటల తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది.

 

స్థానికంగా ఉన్న అపార్ట్ మెంట్ వాసులతో మాట్లాడి వారికీ ఏ అవసరం వచ్చిన అండగా ఉండాలని వర్షం మరింత పెరిగితే వారికీ ఆశ్రమం ఇచ్చే విధంగా అపార్ట్మెంట్ వాసులతో చర్చించి రురల్  శ్రీధర్ రెడ్డి ఏర్పాటు చేసారు.

 

 రెవిన్యూ అధికారులు మరియు స్థానిక నాయకుల సహకారం తుఫాన్  వల్ల ఇబ్బంది పడ్తున్న వారందరి భోజనం ఏర్పాట్లు కూడా చేశారు. ఇలా ఫోన్ కాల్స్ తో  సంఘటనలు జరిగిన ప్రదేశానికి పరిగెత్తుకుంటూ వెళ్లడం శ్రీధర్ రెడ్డికి మామూలే. అసెంబ్లీ సమావేశాలపుడు తప్ప మిగతా సమయంలో నియోజకవర్గం కాలనీలో తిరుగుతూ గడిపే శ్రీధర్ రెడ్డి ఎపుడు అందరికి అందుబాటులో ఉంటారు.అందుకే కాలనీ లో ఉన్నవాళ్లకి వరదలో గుర్తుకొచ్చింది శ్రీధర్ రెడ్డియే.ఆయన కూడా నిమిషాలలో రెవిన్యూ, కార్పొరేషన్ అధికారులను  అప్రమత్తం చేసి సరిగ్గా పదిహను నిమిషాలలో జలమయమయిన కాలనీకి చేరుకోవడం అందరికి ఆశ్యర్యపరిచింది.

తన పిలుపునకు స్పందించి వెంటనే జలమయమయిన కాలనీకి  చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్న   రెవిన్యూ, కార్పొరేషన్, పోలీస్ అధికారులను ఆయన అభినందించారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?