హత్యకు కుట్ర: అభిమానులే రక్ష .. గన్‌మెన్లను తిరస్కరించిన వంగవీటి రాధాకృష్ణ

By Siva Kodati  |  First Published Dec 28, 2021, 7:40 PM IST

ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లను టీడీపీ నేత వంగవీటి రాధా తిరస్కరించినట్లుగా వార్తలు వస్తుండటంతో స్వయంగా ఆయనే స్పందించారు. గన్‌మెన్లను తిరస్కరించిన మాట నిజమేనని అన్నారు. తాను నిత్యం ప్రజల్లో వుండే వ్యక్తినని .. అందుకే సెక్యూరిటీ వద్దన్నానని చెప్పుకొచ్చారు. 


ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్లను టీడీపీ నేత వంగవీటి రాధా తిరస్కరించినట్లుగా వార్తలు వస్తుండటంతో స్వయంగా ఆయనే స్పందించారు. గన్‌మెన్లను తిరస్కరించిన మాట నిజమేనని అన్నారు. తాను నిత్యం ప్రజల్లో వుండే వ్యక్తినని .. అందుకే సెక్యూరిటీ వద్దన్నానని చెప్పుకొచ్చారు. అన్ని పార్టీల నుంచి నేతలు తన క్షేమంపై ఆరా తీశారన్నారు రాధా. పోలీసులు ఇప్పటి వరకు తన దగ్గరకు రాలేదని.. వస్తే స్పందిస్తానని చెప్పారు వంగవీటి రాధాకృష్ణ. 

మరోవైపు వంగవీటి రాధాకృష్ణ హత్యకు రెక్కీ అంశంపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. విజయవాడకు చెందిన ఓ కార్పోరేటర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రాధాతో నిన్న రాత్రి పోలీసులు ఫోన్‌లో మాట్లాడి కొన్ని వివరాలు సేకరించారు. రాధా సన్నిహితుల నుంచి ఇంటెలిజెన్స్ వర్గాలు వివరాలు సేకరించాయి. అనుమానిత ఆధారాల కోసం ముమ్మర విచారణ కొనసాగుతోంది. మరోవైపు తనకు గన్‌మెన్‌లు వద్దని రాధా పోలీసులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గన్‌మెన్‌లను పంపుతామని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. 

Latest Videos

undefined

Also Read:వంగవీటి రాధా హత్యకు రెక్కీ: గుట్టుగా విచారణ, పోలీసుల అదుపులో కార్పోరేటర్..?

కాగా.. తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని సంచలన ఆరోపణలు చేసిన vangveeti Radhaకు రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2+2 సెక్యూరిటీని కల్పించాలని సీఎం Ys Jagan పోలీస్ అధికారులను ఆదేశించారు. తన పై కుట్ర జరుగుతోందని, తనని చంపడానికి రెక్కి నిర్వహించారని రాధా ఆ దివారం నాడు గుడివాడలో అన్నారు. అయితే దీనికి సంబంధించిన ఆధారాలు సేకరించి రిపోర్ట్ ఇవ్వాలని ఇంటిలిజెన్స్ డీజీపీ ని సీఎం జగన్ ఆదేశించారు.

వంగవీటి రంగా 33 వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం నాడు  రంగా విగ్రహన్ని ఆవిష్కరించిన అనంతరం వంగవీటి రాధా మాట్లాడారు. తనను హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారన్నారు. ఈ రెక్కీ ఎవరు చేశారోననే విషయం త్వరలోనే తేలుతుందన్నారు.తన హత్యకు కుట్రపన్నారని.. ఈ మేరకు రెక్కీ కూడా నిర్వహించారంటూ ఆయన ఆరోపణలు చేశారు. 
   

click me!