టూ వీలర్ మీద పోలీసు వలయాన్ని ఛేదించిన వంగలపూడి అనిత: టీడీపీ నేతల అరెస్టు

By telugu teamFirst Published Jul 31, 2021, 2:47 PM IST
Highlights

తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత టూ వీలర్ మీద పోలీసు వలయాన్ని ఛేదించి టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. కొండపల్లి బయలుదేరిన టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

విజయవాడ: అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ కొండపల్లికి బయలుదేరిన టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వలయాన్ని దాటుకుని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత టూవీలర్ మీద టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. తెలుగు మహిళ నాయకురాలు ముల్పురి సాయి కల్యాణి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి కూడా పార్టీ కార్యాలయానికి వచ్చారు. 

కొండపల్లి మైనింగ్ ప్రాంతానికి బయలుదేరిన టీడీపీ నాయకులు పలువురిని పోలీసులు అరెస్టు చేసి నల్లపాడు, కొల్లిపర్ర పోలీసు స్టేషన్లకు తరలించారు. టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి బయటకు రాగానే వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో టీడీపీ నేతలకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం జరిగింది.

టీడీపీ నేతలు వంగలపూడి అనిత,నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి,మరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎంఎస్ రాజు, నాదెండ్ల బ్రహ్మంలను అరెస్టు చేశారు. టీడీపీ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వంపై అనిత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అధికారులపై తీవ్రంగా మండిపడ్డారు.రాష్ట్రంలో అమలవుతున్న రాజారెడ్డి రాజ్యాంగంప్రకారం నడుచుకుంటున్న ప్రతి అధికారి భవిష్యత్ లో అందుకు తగిన మూల్యంచెల్లించుకుంటాడని, టీడీపీ నిజనిర్థారణ బృందం కొండపల్లి ప్రాంతానికివెళితే ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమిటని ఆమె అన్నారు. శనివారం ఆమె మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

ప్రభుత్వపర్యవేక్షణలో, ప్రజలకు జరుగుతున్న అన్యాయా న్ని, వారి సంపదను పాలకులుదోచుకుంటున్న తీరుని, బాధ్యతగలప్రతిపక్షం బహిరంగ పరచాలనుకోవడం నేరమెలా అవుతుందో ముఖ్యమంత్రి చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కొండపల్లి మైనింగ్ ప్రాంతపరిశీలనకు వెళ్లే టీడీపీ బృందాన్ని చంద్ర బాబునాయుడు బహిరంగంగా ప్రకటించారని, నిన్నకూడా సదరు బృంద సభ్యులు కృష్ణాజిల్లా కలెక్టర్ ను కలిసి, తాముకొండపల్లికి వెళుతున్నామని, తమతోపాటు, అధికారులను పంపాలనికోరారని ఆమె వివరించారు. 

టీడీపీ కార్యాలయానికి చేరుకోవడానికి తాము పోలీసులకళ్లుగప్పి రావాలా అని అనిత ప్రశ్నించారు. బస్సులెక్కి, ద్విచక్రవాహనాలెక్కి కార్యాలయానికి వచ్చామని ఆమె అన్నారు. ప్రతిపక్షనేతలైన తమకే ఇన్నిఇబ్బందులు ఉంటే ఇక సామాన్యుల సంగతిప్రత్యేకంగాచెప్పాల్సిన పనిలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డి కొండపల్లి వెళ్లకుండా తమనుఅడ్డుకున్నా డంటే, అక్కడ అక్రమమైనింగ్ జరుగుతున్నట్లే, వైసీపీనేతలే దగ్గరుండి అదిచేస్తున్నట్లేనని ఆమె అన్నారు. 

ప్రతిపక్షనేతలుగా, పౌరులుగా తమకు కొండప ల్లివెళ్లే హక్కులేదా అని ప్రశ్నించారు. తనపై దాడిచేశారని ఫిర్యాదుచేయడానికి, పోలీస్ స్టేషన్ కు వెళ్లిన వ్యక్తిపైనే తిరిగి తప్పుడు కేసులు పెట్టిజైలుకు పంపుతారా అని దేవినేని ఉమామహేశ్వర రావు అరెస్టును ఉద్దేశించి అన్నారు. ఇవన్నీచూస్తుంటేప్రభుత్వ అవినీతి, అక్రమాలను కప్పిపు చ్చడానికే టీడీపీనేతలను అడ్డుకుంటున్నారని, తమతోపా టు ప్రజలుకూడా అనుకుంటారని ఆమె అన్నారు.

కొండపల్లి మైనింగ్ ప్రాంతాన్నేకాదు, రాష్ట్రంలో అక్రమ మైనిం గ్ జరిగే ప్రతిప్రాంతాన్ని టీడీపీ బృందం సందర్శించే తీరుతుందని ఆెమె అన్నారు. ఇదే మాటను పాలకులురాసి పెట్టుకోవాలని హెచ్చరించారు. టీడీపీనేతలు, కార్యకర్తలనుఅరెస్ట్ చేసి,జైళ్లకు పంపితే, జైళ్లుకూడా సరిపోవని పోలీసులు గుర్తిస్తే మంచిదని అన్నారు. టీడీపీనేతలను అడ్డుకుంటే, కార్యకర్తలు ఇళ్లలోకూర్చోరని అన్నారు. 

click me!