వందే భారత్ ఎక్స్‌ప్రెస్ : తొలుత సికింద్రాబాద్ - బెజవాడ మార్గంలో, తర్వాత విశాఖకు.. ముహూర్తం ఎప్పుడంటే..?

By Siva KodatiFirst Published Dec 4, 2022, 7:47 PM IST
Highlights

సికింద్రాబాద్ - విజయవాడ మార్గంలో త్వరలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పరుగులు తీయనుంది. బెర్తులతో కూడిన వందే భారత్ రైళ్లు వచ్చాక విశాఖ వరకు నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది.

ప్రయాణీకులను వేగంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. దీంతో మిగిలిన రాష్ట్రాలు కూడా తమకు కూడా వాటిని కేటాయించాలని రైల్వే శాఖపై ఒత్తిడి తీసుకొస్తున్నాయి. వీటిలో ఏపీ, తెలంగాణలు కూడా వున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ మధ్య రైల్వేకు కూడా ఒకటి కేటాయించింది. అయితే ఎప్పుడు దీనిని ప్రారంభిస్తారన్న దానిపై మాత్రం క్లారిటీ రాలేదు. సికింద్రాబాద్ నుంచి విశాఖ, విజయవాడ, తిరుపతి రూట్లలో నడపాలని ప్రతిపాదనలు ఉన్నప్పటికీ దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి వుంది. 

అయితే తొలుత సికింద్రాబాద్ - విజయవాడ మార్గంలో నడపాలని, బెర్తులతో కూడిన వందే భారత్ రైళ్లు వచ్చాక విశాఖ వరకు నడపాలని రైల్వే శాఖ యోచిస్తోంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలలోనే సికింద్రాబాద్ - విజయవాడ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలెక్కే అవకాశం వుంది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా దీనిని ప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. 

Also REad:దక్షిణ భారతదేశానికి తొలి వందే భారత్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోడీ..

అంతా బాగానేవుంది కానీ సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ఏ మార్గంలో ఈ రైలు నడుస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. సికింద్రాబాద్ నుంచి బెజవాడకు రెండు మార్గాలు వున్నాయి. ఒకటి కాజీపేట మీదుగా కాగా, రెండోది నల్గొండ మీదుగా. కాజీపేట మార్గంలో ట్రాక్ గరిష్ట వేగం 130 కి.మీ కాగా.. నల్గొండ మార్గంలో 110 కి.మీ. అయితే దీనిని త్వరలోనే 180 కి.మీలకు పెంచాల్సి వుంటుంది. ఈ రైలులో సీట్లు మాత్రమే వుంటాయి, బెర్తులు వుండవు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గరిష్ట వేగం 180 కిలోమీటర్లు కాగా, రెండు నిమిషాల్లోనే 160 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 

click me!