
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల, రీజినల్ కో ఆర్ఢినేటర్లు, నియోజకవర్గ ఇంచార్జ్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి ఇద్దరు మంత్రులు, కొందరు ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మీటింగ్‌కు తాను హాజరుకాకపోవడంపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్పందించారు. ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. తాను ఐఎస్‌బీలో కోర్సు చేస్తున్నానని.. అందుకు సంబంధించిన పరీక్షలు జరుగుతున్నాయని అందుకే తాను సీఎం జగన్ సమావేశానికి హాజరుకాలేదని చెప్పారు.
తాను ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఒక కోర్సు చేస్తున్నానని వల్లభనేని వంశీ తెలిపారు. కిందటిసారి తనకు కోవిడ్ రావడం వల్ల దానికి అంటెండ్ కాలేకపోయానని చెప్పారు. అది ఫైనల్ స్టేజ్‌కు వచ్చిందని.. ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నందు వల్ల సీఎం జగన్ మీటింగ్‌కు హాజరుకాలేదని తెలిపారు. తాను, కొడాలి నాని పార్టీ మారతామని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గోడ దూకుతామని జరుగుతున్న ప్రచారం మెరుపుకలే అని విమర్శించారు. అటువంటి పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
విరాళాలు, నిధుల కోసమే ముందస్తు ఎన్నికలంటూ టీడీపీ ప్రచారం చేస్తుందని విమర్శించారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారని టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుందని విమర్శించారు. క్యాడర్‌లో జోష్ నింపాలనే ఉద్దేశంతోనే ముందస్తు ఎన్నికల అంటూ, ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని టీడీపీ గ్లోబెల్స్ ప్రచారం చేస్తుందని ఆరోపించారు.