జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి: వైసీపీ కార్యకర్తల పనేనంటున్న కుటుంబసభ్యులు

Siva Kodati |  
Published : Sep 27, 2020, 10:19 PM ISTUpdated : Sep 27, 2020, 10:21 PM IST
జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి: వైసీపీ కార్యకర్తల పనేనంటున్న కుటుంబసభ్యులు

సారాంశం

జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుల దాడిలో రామచంద్రకు గాయాలయ్యాయి

జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుల దాడిలో రామచంద్రకు గాయాలయ్యాయి.

క్షతగాత్రుడిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం కొత్తకోట జడ్పీ హైస్కూల్‌ సమీపంలోని తోపుడు బండి వద్ద రామచంద్ర కొనుగోలు చేస్తున్న సమయంలో గుర్తుతెలియిన దుండగులు కారులో వచ్చి ఇనుపరాడ్లతో దాడికి పాల్పడి పరారయ్యారు.

బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వైసీపీ నాయకులే రామచంద్రపై దాడికి పాల్పడ్డారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

విజయవాడలో జరిగిన ఓ రౌండ్ టేబుల్ సమావేశంలో జడ్జి రామకృష్ణ గట్టిగా మాట్లాడటంతోనే వైసీపీ నాయకుడు కక్షగట్టి ఈ దాడికి తెగబడ్డారని ఆరోపిస్తున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన దళిత సంఘాలు .. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని పిలుపునిచ్చాయి.

 

"

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్