అమరావతిలో రాజధాని రచ్చ కొనసాగుతోంది. జాతీయ రహదారుల దిగ్భంధనాన్ని పోలీసులు భగ్నం చేశారు. టీడీపీ, జేఏసీ నేతలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.
అమరావతి:అమరావతి నుండి రాజధానిని మార్చకూడదని డిమాండ్ చేస్తూ మంగళవారం నాడు జాతీయ రహదారుల దిగ్భంధనాన్ని రాజకీయపార్టీల జేఎసీ పిలుపునిచ్చింది. అయితే జాతీయ రహదారిని దిగ్భంధన కార్యక్రమానికి టీడీపీనేతలు వెళ్లకుండా పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేశారు.
గుంటూరు, విజయవాడ తదితర ప్రాంతాల్లో టీడీపీ నేతలను, జేఎసీ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, విజయవాడ ఎంపీ కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
undefined
Also read:అమరావతి ఉద్యమంలో విషాదం... మరో రైతు మృతి
మంగళవారం నాడు తెల్లవారుజాము నుండి టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ, జేఎసీ నేతల ఇళ్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. జాతీయ రహదారిపై రాస్తారోకోలు, దిగ్భంధనం కోసం ప్రయత్నాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకొంటామని పోలీసులు తేల్చి చెప్పారు.
read more అంతకు మించి... ఆ పోలీసులు రిటైరయినా వదిలిపెట్టం...: చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇవాళ చీకటి రోజు అంటూ అభిప్రాయపడ్డారు. జాతీయ రహదారిని దిగ్భంధించేందుకు లెఫ్ట్ పార్టీల నేతలు ప్రయత్నాలు చేశారు. వామపక్షపార్టీల నేతలను పార్టీ కార్యాలయాల్లోకి వెళ్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు కేశినేని నాని, దేవినేని ఉమ, బొండా ఉమ, బోడే ప్రసాద్‌లను కూడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
పోలీసు బస్సు కింద వామపక్ష నేతలు పడుకొని నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేసిన లెఫ్ట్ కార్యకర్తలను పోలీసులకు లెఫ్ట్ పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది.