Andhra Pradesh: మహిళా భక్తులు స్నానం చేస్తుండగా ఫోన్‌తో వీడియో రికార్డింగ్

Published : Aug 04, 2023, 06:05 AM IST
Andhra Pradesh: మహిళా భక్తులు స్నానం చేస్తుండగా ఫోన్‌తో వీడియో రికార్డింగ్

సారాంశం

ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించడానికి రెండు కుటుంబాలు వచ్చాయి. ఇద్దరు మహిళలు స్నానం చేయడానికి సమీపంలోని తాత్కాలిక మరుగుదొడ్లలోకి వెళ్లారు. ఓ దుండగుడు వెంటిలేటర్ నుంచి చూపిస్తూ ఫోన్‌లో రికార్డు చేయడం గమనించి మహిళలు కేక పెట్టడంతో ఆ ఆగంతకుడు పారిపోయారు.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ జిల్లాలో అవాంఛనీయ ఘటన చోటుచేసుకుంది. ఒంటిమిట్ట ఆలయానికి వచ్చిన మహిళఆ భక్తులు అక్కడే ఉన్న తాత్కాలిక మరుగుదొడ్లలో స్నానం చేయడనికి వెళ్లారు. అదే సమయంలో ఓ యువకుడు సెల్ ఫోన్ తీసి వారిని రికార్డ్ చేయడానికి ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది.

ఒంటిమిట్ట ఆలయానికి రెండు కుటుంబాలు వచ్చాయి. నిన్న ఉదయం 9.30 గంటలకు ఆ కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళలు సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక మరుగుదొడ్లలోకి వెళ్లారు. స్నానం చేయడానికి అక్కడికి వెళ్ళారు. అంతలోనే ఓ యువకుడు చేతిలో సెల్ ఫోన్ పట్టుుకని లోపలికి చూశాడు. వెంటిలేటర్ గుండా వారిని రికార్డ్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ మహిళలు ఆయనను గమనించి వెంటనే కేకలు వేశారు. దీంతో ఆ ఆగంతకుడు స్పాట్ నుంచి పారిపోయాడు.

Also Read: Andhra Pradesh: చిన్ని కుటుంబం చెరిగిపోయింది.. భార్య, పిల్లలను చంపేసి భర్త సూసైడ్

ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు మౌఖకంగా ఫిర్యాదు అందించారు. దీంతో పోలీసులు పరిసర ప్రాంతాల్లో నిందితుడి కోసం గాలింపులు మొదలు పెట్టారు. ఇంకా ఆచూకీ దొరకలేదు. ఈ ఏరియాలో సీసీటీవీ కెమెరాలు పని చేయడం లేదని తెలిసింది. మహిళల స్నానపు గదులు, దుస్తులు మార్చుకునే గదుల వద్ద మంచి భద్రత చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఉంటామని వివరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Gudivada Amarnath Pressmeet: కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్నాథ్‌ పంచ్ లు| Asianet News Telugu
CM Chandrababu Naidu: అధికారం దుర్వినియోగం చేసేవారిపై బాబు సీరియస్| Asianet News Telugu