వూహాన్‌లోని జ్యోతికి మంత్రి ఫోన్: అఖిలప్రియ వద్ద స్పృహ తప్పిన తల్లి

By narsimha lodeFirst Published Feb 7, 2020, 2:37 PM IST
Highlights

కర్నూల్ జిల్లాకు చెందిన టెక్కీ జ్యోతిని ఇండియాకు రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంటుందని మంత్రి జయశంకర్ హామీ ఇచ్చారు. 


కర్నూల్:  వూహాన్‌లో చిక్కుకొన్న టెక్కీ జ్యోతితో కేంద్ర మంత్రి జయశంకర్ ఫోన్‌లో మాట్లాడారు. వూహాన్‌ నుండి వీలైనంత త్వరగా ఆమెను ఇండియాకు రప్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మరో వైపు వుహాన్‌లో ఉన్న తన కూతురు కోసం బెంగ పెట్టుకొన్న తల్లి ప్రమీలాదేవి శుక్రవారం నాడు స్పృహ తప్పిపోయారు.

కర్నూల్ జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్ణపాడు గ్రామానికి చెందిన టెక్కీ జ్యోతి  చైనాలో శిక్షణ కోసం వెళ్లింది. జ్యోతితో పాటు వెళ్లిన టెక్కీలు ఇండియాకు తిరిగి వచ్చారు. ఇండియా నుండి  రెండు విమానాలు వెళ్లాయి.  విమానం ఎక్కే సమయానికి జ్యోతికి జ్వరం ఉండడంతో ఆమెను విమనాం ఎక్కేందుకు అధికారులు అనుమతించలేదు.

ఇదే విషయాన్ని జ్యోతి ఓ వీడియో తీసి కుటుంబసభ్యులకు పంపారు.  జ్యోతి శుక్రవారం నాడు కూడ మరోసారి తన కుటుంబసభ్యులకు మరో వీడియోను పంపింది. ఈ వీడియోలో తాను ఉన్న పరిస్థితిని ఆమె వివరించింది.

తాను ఆరోగ్యంగానే ఉన్నానని  జ్యోతి ప్రకటించారు. తనకు చైనాకు చెందిన వైద్య, ఆరోగ్యశాఖాధికారులు ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదని ఆమె చెప్పారు. తాను చైనాలో ఉన్న ఇండియన్ ెంబసీ అధికారులతో సంప్రదింపులు జరిపినట్టుగా ఆమె చెప్పారు.  అయితే ఎంబసీ అధికారులు జాప్యం చేస్తున్నారని జ్యోతి ఆరోపించారు.

Also read:చైనాలో చిక్కుకొన్న తెలుగు టెక్కీ జ్యోతి: ఇండియా ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకొన్న అధికారులు

తాను ఉంటున్న నగరం కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉందని ఆమె చెప్పారు.  అయినా కూడ ఇంతరకు తనకు ఎలాంటి పరీక్షలు నిర్వహించలేదని ఆమె చెప్పారు.  ఈ నెల 19వ తేదీతో జ్యోతి వీసా గడువు ముగియనుంది. 

జ్యోతిని సురక్షితంగా ఇండియాకు తిరిగి రావాలని  వైసీపీ ఎంపీ బ్రహ్మనందరెడ్డి విదేశాంగ మంత్రిత్వశాఖను కోరారు. వెంటనే జ్యోతిని ఇండియాకు రప్పించాలని ఆయన విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారులను కోరారు. 

మరోవైపు ఇదే విషయమై కేంద్ర మంత్రి దృష్టికి వైసీపీ ఎంపీలు తీసుకొచ్చారు. అయితే  కేంద్ర మంత్రి జయశంకర్ వూహాన్‌లో ఉన్న జ్యోతితో ఫోన్‌లో మాట్లాడారు. వీలైనంత త్వరగా ఇండియాకు రప్పించేందుకు  చర్యలు తీసుకొంటామని మంత్రి జ్యోతికి హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే  జ్యోతి తల్లి ప్రమీలాదేవిని  మాజీ మంత్రి భూమా అఖిలప్రియ శుక్రవారం నాడు పరామర్శించారు. జ్యోతి గురించి మాట్లాడుతున్న సమయంలోనే ఆమె స్పృహ కోల్పోయింది. ఇవాళ ఉదయం ప్రవీులా దేవితో పాటు జ్యోతికి కాబోయే భర్త కూడ జ్యోతి సురక్షితంగా తిరిగి రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

click me!