తాడేపల్లి: జగన్‌ను కలిసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఘనంగా సత్కరించిన సీఎం

By Siva KodatiFirst Published Aug 19, 2021, 8:22 PM IST
Highlights

ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్‌ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు. అనంతరం కిషన్‌రెడ్డి దంపతులకు సీఎం జగన్‌ దంపతులు వేంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు బహూకరించారు.

ఏపీ ముఖ్యమంత్రి సీఎం వైఎస్ జగన్‌ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని  సీఎం  క్యాంపు కార్యాలయానికి వెళ్లిన కిషన్ రెడ్డిని వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో కలసి వచ్చిన కేంద్ర మంత్రిని జగన్, భారతి దంపతులు సత్కరించారు. కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేశారు. కిషన్‌రెడ్డి దంపతులకు సీఎం జగన్‌ దంపతులు వేంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేసి నూతన వస్త్రాలు బహూకరించారు. అనంతరం ఆయన విజయవాడ జన ఆశీర్వాద యాత్రకు బయలుదేరారు.

Also Read:సీఎం జగన్ పిలిచారు... అందుకే వెళుతున్నా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (వీడియో)

అంతకుముందు జన ఆశీర్వాద యాత్రలో స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కారు ఎక్కుతున్న సమయంలో తలకు స్వల్ప గాయమైంది. ఆయన తిరిగి వెళ్లేందుకు కారు ఎక్కే సమయంలో ఫోటోలు దిగేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అదే సమయంలో కారు డిక్కీ తీసి వేస్తుండగా కిషన్ రెడ్డి తలకు తలిగి గాయమైంది. వెంటనే వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారు. గాయాన్ని లెక్క చేయకుండా ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

click me!