రెండేళ్లలో రాజకీయ ప్రకంపనలు, బాబుపై కీలక వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి

By narsimha lodeFirst Published Jul 7, 2019, 2:57 PM IST
Highlights

రానున్న రెండేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో  రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకొంటాయని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
విజయవాడలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం నాడు ఆయన ప్రారంభించారు.

అమరావతి: రానున్న రెండేళ్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో  రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకొంటాయని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
విజయవాడలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం నాడు ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన  మాట్లాడారు. మాజీ సీఎం చంద్రబాబుపై కక్షసాధింపు చర్యలు ఉండవన్నారు. గతంలో త్రిపురలో ఒక్క శాతం కూడ బీజేపీకి ఓటింగ్ లేని విషయాన్ని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. కానీ, ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉందన్నారు. రెండేళ్లలో ఎవరూ కూడ ఊహించని రాజకీయ పరిణామాలు ఉంటాయన్నారు.

ఏపీలో మాజీ సీఎం కొడుకు, తెలంగాణలో సీఎం కూతురు ఎన్నికల్లో ఓటమిపాలయ్యారని ఆయన ఎద్దేవా చేశారు. ఫ్రంట్ ఫ్రంట్ అంటూ ఏపీలో తన టెంట్ లేకుండా  చంద్రబాబు చేసుకొన్నాడని ఆయన సెటైర్లు వేశారు. రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానన్న కేసీఆర్  తన కూతురును కూడ గెలిపించుకోలేకపోయాడన్నారు.

చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో జత కట్టినందునే ఏపీ ప్రజలు బుద్ది చెప్పారన్నారు. కర్ణాటక సంక్షోభంతో బీజేపీకి సంబంధం లేదన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక బీజేపీపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు.
 

click me!