కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు గాయం: ఏం జరిగిందంటే?

Published : Aug 19, 2021, 04:21 PM ISTUpdated : Aug 19, 2021, 04:46 PM IST
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు గాయం:  ఏం జరిగిందంటే?

సారాంశం

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు గాయమైంది. కారు డోర్ తగలడంతో ఈ గాయమైంది.  దుర్గగుడికి వెళ్లే సమయంలో  ఈ ఘటన  చోటు చేసుకొంది.

విజయవాడ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తలకు గురువారం నాడు గాయమైంది. ఆశీర్వాద సభ ముగించుకొని దుర్గగుడికి వెళ్లే సమయంలో కారు డోర్ ఆయన తలకు తగిలింద. దీంతో ఆయన తలకు గాయమైంది.

 

జన ఆశీర్వాద సభలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చారు. ఇవాళ ఉదయం ఆయన తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకొన్నారు. అక్కడి నుండి నేరుగా ఆయన విజయవాడకు వచ్చారు. 

విజయవాడలో ఆయన బీజేపీ నిర్వహించిన ఆశీర్వాదసభలో పాల్గొన్నారు. ఈ సభ ముగిసిన తర్వాత కిషన్ రెడ్డి విజయవాడలో ఇంద్రకీలాద్రి ఆలయంలో దుర్గమ్మను దర్శించుకొనేందుకు వెళ్లేందుకు ఆయన కారు ఎక్కుతున్న క్రమంలో ఆయనకు గాయాలయ్యాయి.మంత్రి కారులో కూర్చొనే సమయంలో   కారు డోర్ ఆయన తలకు బలంగా తగిలింది.
 

PREV
click me!

Recommended Stories

Scrub Typhus : తెలుగు రాష్ట్రాల్లో కొత్త వ్యాధి.. ఏమిటిది, ఎలా సోకుతుంది, లక్షణాలేంటి?
Vegetables Price : వీకెండ్ మార్కెట్స్ లో ఏ కూరగాయ ధర ఎంత..?