బాబును కూడా కలవలేకపోతున్నా.. టీడీపీలో నేను ఒంటరివాడిని, త్వరలోనే రాజీనామాపై ప్రకటన: బుచ్చయ్య చౌదరి

Siva Kodati |  
Published : Aug 19, 2021, 04:12 PM IST
బాబును కూడా కలవలేకపోతున్నా.. టీడీపీలో నేను ఒంటరివాడిని, త్వరలోనే రాజీనామాపై ప్రకటన: బుచ్చయ్య చౌదరి

సారాంశం

రాజీనామా చేస్తున్నారంటూ వస్తున్న కథనాలపై  టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించారు. త్వరలోనే రాజీనామాపై బహిరంగంగా నిర్ణయం తెలియజేస్తానని తెలిపారు. పార్టీలో ప్రస్తుతం తాను ఒంటరివాడినని బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. 

తన రాజీనామాపై నిర్ణయాన్ని త్వరలో బహిరంగంగా చెబుతానన్నారు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ప్రస్తుతం టీడీపీ నిర్వహణలోనే  లోపాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. తాను చంద్రబాబును కలవనని.. కానీ పార్టీ నేతలు మాత్రం కలుస్తారంటూ దుయ్యబట్టారు. పార్టీలో ప్రస్తుతం తాను ఒంటరివాడినని బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. 

ALso Read:చంద్రబాబుకు భారీ షాక్: టీడీపీకి ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి రాజీనామా?

రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే టీడీపీ రాజీనామా చేసే అవకాశాలున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం సాగుతోంది. చాలా కాలంగా ఆయన చంద్రబాబు తీరు పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. 1995 టీడీపీ సంక్షోభంలో ఆయన ఎన్టీఆర్ వెంట ఉన్నారు. ఆ మధ్య ఒక సందర్భంలో టీడీపీలోకి జూనియర్ ఎన్టీఆర్ వస్తారని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు అప్పట్లో చర్చకు దారి తీశాయి. సీనియర్ ఎమ్మెల్యే అయినప్పటికీ చంద్రబాబు ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్