విజయవాడ కారులో డెడ్‌బాడీ: రాహుల్‌ది హత్యేనని నిర్ధారించిన పోలీసులు

By narsimha lode  |  First Published Aug 19, 2021, 4:06 PM IST

విజయవాడ నగరంలోని మాచవరంలో పార్క్ చేసిన కారులో డెడ్ బాడీ ఘటనపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. కరణం రాహుల్ ను హత్య చేసి పార్కింగ్ చేసిన కారులో డెడ్ బాడీ వదిలేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కారులో తాడు సహా కొన్ని ఆధారాలను పోలీసులు సీజ్ చేశారు.


విజయవాడ: విజయవాడ నగరంలోని మాచవరం వద్ద కారులో డెడ్‌బాడీ ఘటనలో పోలీసులు కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించారు. కారులోని కరణం రాహుల్  హత్యకు గురయ్యాడని పోలీసులు నిర్ధారించారు. 

also read:విజయవాడలో కలకలం: పార్క్ చేసిన కారులో డెడ్‌బాడీ, మృతుడు ఎవరంటే?

Latest Videos

undefined

also read: విజయవాడ కారులో డెడ్‌బాడీ, టెక్నికల్ ఆధారాలతో దర్యాప్తు: ఇంచార్జీ సీపీ పాల్ రాజు

కారులో దొరికిన ఆధారాల మేరకు ఈ విషయాన్ని ధృవీకరించారు. కారులో ఓ తాడును కూడా పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఈ తాడు సహయంతోనే రాహుల్ ను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.  వ్యాపారంలో ఆర్ధిక లావాదేవీలే హత్యకు కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 డ్రైవింగ్ సీట్లో ఉన్న రాహుల్  కారులోనే మరణించినట్టుగా పోలీసులు గుర్తించారు. కారు షోరూం నుండి మెకానిక్ లను రప్పించి కారు డోర్ ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించారు. తొలుత కారు టైర్  విప్పి డోర్ ఓపెన్ చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కారు అద్దం పగులగొట్టి డోర్ ఓపెన్ చేశారు.

జిల్లాలోని జి.కొండూరు మండలంలో జిక్సిన్ సిలిండర్ల కంపెనీ యజమాని కరణం రాహుల్ అనుమానాస్పద మృతి చెందారు. కారు డోర్ ను ఓపెన్ చేసిన తర్వాత  కారు తాళం చెవి ఇంకా లభ్యం కాలేదు.  కారు కీ ఎక్కడికి వెళ్లిందనే  విషయమై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

మృతదేహం మెడ కింది భాగంలో ఒరుసుకుపోయినట్టుగా పోలీస్ క్లూస్ టీమ్ గుర్తించింది.  మృతదేహన్ని పోస్టుమార్టానికి పంపనున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో  రాహుల్ మృతికి గల కారణాలు తేలుతాయి.

రాహుల్ కాల్ డేటాను కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కార పార్క్ చేసిన ప్రాంతానికి ఎదురుగా ఉన్న భవనంలో ఉన్న సీసీటీవీ పుటేజీని కూడ పోలీసులు ఆరాతీస్తున్నారు. మరోవైపు ఈ కారు నిన్న సాయంత్రం నుండి ఎక్కడెక్కడ తిరిగిందనే విషయమై  కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయమై పోలీసులు ఐదు పోలీస్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.


 

click me!