పోలవరం ప్రాజెక్ట్.. ఏపీ ప్రభుత్వంపై గజేంద్ర సింగ్ షెకావత్ సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 04, 2022, 08:28 PM IST
పోలవరం ప్రాజెక్ట్.. ఏపీ ప్రభుత్వంపై గజేంద్ర సింగ్ షెకావత్ సంచలన వ్యాఖ్యలు

సారాంశం

పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. సవరించిన అంచనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివరాలు ఇవ్వడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.   

పోలవరం ప్రాజెక్ట్‌కు (polavaram project) సంబంధించి సవరించిన అంచనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివరాలు  ఇవ్వడం లేదన్నారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. వివరాలు ఇచ్చిన తర్వాతే ఆమోదించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. ఇకపోతే... పోలవరం ప్రాజెక్ట్ రివ్యూలో కీలక సమస్యలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్. 2017-18 ధరల ప్రకారం.. ప్రాజెక్ట నిర్మాణ వ్యయం అంచనా రూ.55,548 కోట్లకు ఖరారు చేయాలని కోరారు. తాగునీటి కాంపోనెంట్‌ను ప్రాజెక్ట్‌లో భాగంగా పరిగణించాలని అన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో కేంద్రం కాంపోనెంట్ వారిగా రియంబర్స్‌మెంట్ చేస్తోంది. 

దాని వల్ల పోలవరం కుడి, ఎడమ కాలువలకు సంబంధించి పనులు ముందుకు సాగని పరిస్ధితి వుందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. చేసిన పనులకు బిల్లులు కూడా పీపీఏ అప్‌లోడ్ చేయడం లేదన్నారు సీఎం జగన్. ప్రభుత్వం చేసిన ఖర్చుకు కేంద్రం రీయంబర్స్‌మెంట్ మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందన్నారు. వివిధ పనుల కోసం ఖర్చు చేసిన 859 కోట్ల రూపాయల బిల్లులను పీపీఏ నిరాకరించిన విషయాన్ని కేంద్రమంత్రికి వివరించారు. మొత్తం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ఒకే కాంపొనెంట్‌గా తీసుకోవాలని అన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు సీఎం జగన్. 

అంతకుముుందు తూర్పు గోదావరి జిల్లాలోని Devipatnam  మండలం ఇందుకూరుపేట-1 పోలవరం పునరావాసం కాలనీని ఏపీ సీఎం వైఎస్ జగన్, కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌లు శుక్రవారం నాడు పరిశీలించారు.నిర్వాసితులతో కేంద్ర మంత్రి షెకావత్, ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. ఏనుగులగెడం, మంటూరు, ఆగ్రహారం గ్రామాల ప్రజల కోసం Indukuripet-1 పునరావాస కాలనీని ఏర్పాటు చేశారు. పోలవరం పునరావాస కాలనీలో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేశారని కేంద్ర మంత్రి Gajendra Shekhawat చెప్పారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించిన సీఎం YS Jagan నుకేంద్ర మంత్రి అభినందించారు.

నిర్వాసితుల సమస్యలపై తాను సీఎం జగన్ తో చర్చించామన్నారు. పునరావాస కాలనీలో నిర్మాణాలు నాణ్యంగా ఉండాలని ఆయన కోరారు. మరో వైపు నిర్వాసితులకు జీవనోపాధిని కల్పించాలని కూడా కోరుతున్నామన్నారు.  ఈ  ప్రాజెక్టు నిర్మాణం పూర్తైన తర్వాత తాను మరోసారి  ఇక్కడికి వస్తానని కేంద్ర మంత్రి షెకావత్   తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే