
చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో దొంగస్వామి బాగోతం బయటపడింది. ఓంశక్తి ఆలయ అర్చకుడిగా మహిళా భక్తులను నిండా ముంచాడు దొంగస్వామి ఆంజనేయులు. గుడికొచ్చే మహిళా భక్తులే టార్గెట్‌గా దోపిడి చేస్తున్నాడు. ఓం శక్తి ఆలయం నిర్మాణం పేరుతో చందాలు దండుకోవడమే కాకుండా... అధిక వడ్డీకి ఆశ చూపి అమాయక మహిళల దగ్గర చిట్టీల రూపంలో రూ. 25 కోట్లను వసూలు చేసి పరారయ్యాడు