అలా చేస్తే నేను మీడియాతో మాట్లాడను: బాబుకు ఉండవల్లి సవాల్

Published : Sep 25, 2018, 01:15 PM IST
అలా చేస్తే నేను మీడియాతో మాట్లాడను: బాబుకు ఉండవల్లి సవాల్

సారాంశం

గోదావరి పుష్కరాల తొక్కిసలాట సంఘటనలో ప్రథమ ముద్దాయి చంద్రబాబేనని ఉండవల్లి అన్నారు. అన్నా క్యాంటీన్లలో అంతా అవినీతేనని ఆయన ఆరోపించారు. 

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి ఆరుణ్ కుమార్ మరోసారి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టులో అంతా అవినీతేనని ఆయన మంగళవారం మీడియాతో అన్నారు. కాగ్ నివేదికే అందుకు నిదర్శనమని అన్నారు. 

తన ఆరోపణలు అవాస్తవమని పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీరుతో వివరణ ఇప్పిస్తే తాను ఇక మీడియాతో మాట్లాడబోనని ఆయన అన్నారు. పోలవరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి సంబంధం లేదని ఆయన అన్నారు. 

గోదావరి పుష్కరాల తొక్కిసలాట సంఘటనలో ప్రథమ ముద్దాయి చంద్రబాబేనని ఉండవల్లి అన్నారు. అన్నా క్యాంటీన్లలో అంతా అవినీతేనని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై కుటుంబరావుతో చర్చిస్తామని ఆయన అన్నారు.

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే