
త్వరలో రానున్న ఎన్నికలను ఎదురుకునేందుకు జనసేన సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీ కీలక బాధ్యతలను ఒక్కొక్కరిగా అప్పగిస్తోంది. కాగా.. తాజాగా జనసేన పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా భీమవరానికి చెందిన న్యాయవాది ఉండపల్లి రమేష్‌నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ నియామక ఉత్తర్వులు అందించారని ఆయన తెలిపారు. ప్రస్తుతం 11 జిల్లాలకు న్యాయ విభాగం జిల్లా అధ్యక్షులను నియమిస్తు పార్టీ కేంద్ర కార్యాలయం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. జిల్లాకు న్యాయ విభాగం అధ్యక్షుడిగా ఉండపల్లికి కేటాయించారు. రమేష్‌నాయుడు ప్రస్తుతం చిరుపవన్‌తేజం వ్యవస్థాపక అధ్యక్షుడిగా, మెగాఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడిగా, కాపు యువసేన జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
2009లో ప్రజారాజ్యంలో చేరి యువరాజ్యం జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 2014లో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అప్పటి నుంచి రాజకీయాలలో కొనసాగుతున్నారు. జనసేన పార్టీ ప్రారంభించాక ఆ పార్టీ అనుచరుడిగా ఉంటున్నారు. తాజా నియామకాలలో రమేష్‌నాయుడి సేవలు గుర్తించిన పవన్‌కల్యాణ్ ఆయనకు ఈ పదవిని అప్పగించారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులై న రమేష్ నాయుడిని పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందించారు. ఆయన మరిన్ని పదవులు చేపట్టాలని పలువురు అభిలాషించారు.