ఓట్ల కోసం కాదు..సాయం చేసేందుకే వచ్చా: శ్రీకాకుళంలో పవన్

By Nagaraju TFirst Published Oct 18, 2018, 11:38 AM IST
Highlights

ఓట్ల కోసం రాలేదని తిత్లీ తుఫాన్ బాధితులకు సాయం చేసేందుకే వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తిత్లీ తుఫాన్ ధాటికి సర్వం కోల్పోయిన శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ రెండోరోజు పర్యటిస్తున్నారు. తిత్లీ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయ్యిందని అయితే ఇప్పటి వరకు కేంద్రప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. 

శ్రీకాకుళం: ఓట్ల కోసం రాలేదని తిత్లీ తుఫాన్ బాధితులకు సాయం చేసేందుకే వచ్చానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తిత్లీ తుఫాన్ ధాటికి సర్వం కోల్పోయిన శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ రెండోరోజు పర్యటిస్తున్నారు. తిత్లీ తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అతలాకుతలం అయ్యిందని అయితే ఇప్పటి వరకు కేంద్రప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరంగా ఉందన్నారు పవన్ కళ్యాణ్. 

కేరళలో వరదలు సంభవించినప్పుడు స్పందించిన కేంద్రం శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ పై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. జనసైనికులంతా తీత్లీ తుఫాన్ విధ్వంసాన్ని ప్రపంచానికి తెలియజేయాలని పవన్ కోరారు. శ్రీకాకుళం జిల్లా తుఫాన్ బాధితులకు జనసేన పార్టీ కార్యకర్తలు అండగా నిలవాలని సూచించారు. అలాగే ఎన్ఆర్ఐలు శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. తెలుగు ప్రజలంతా శ్రీకాకుళం జిల్లాకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.  

అలాగే తిత్లీ తుఫాన్ బాధితులను ఆదుకోవాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి త్వరలోనే లేఖ రాయనున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్ తో కలిసి కేంద్రం సాయం కోరతానని ప్రకటించారు పవన్.

మరోవైపు తిత్లీ తుఫాన్ ను రాజకీయం చేయోద్దని అధికార ప్రతిపక్ష పార్టీలకు పవన్ సూచించారు. బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నించాలే తప్ప రాజకీయాలు చేయడం తగదన్నారు. చంద్రబాబు నాయుడు అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం అని చెప్పే దానికన్నా ఎంత నష్టం జరిగింది ఎంత విధ్వంసం జరిగిందో అన్నది తెలియజేస్తే బాగుంటుందని తెలిపారు. 
 

click me!