డ్వాక్రా రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధమా:జగన్ కు మంత్రి పరిటాల సునీత సవాల్

Published : Oct 18, 2018, 12:02 PM IST
డ్వాక్రా రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధమా:జగన్ కు మంత్రి పరిటాల సునీత సవాల్

సారాంశం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు మంత్రి పరిటాల సునీత సవాల్ విసిరారు. డ్వాక్రా రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి జగన్ ను ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు చేయూతపై వేదిక ఏదైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు తాను సిద్దమని జగన్ సిద్దమా అంటూ నిలదీశారు.  

అనంతపురం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు మంత్రి పరిటాల సునీత సవాల్ విసిరారు. డ్వాక్రా రుణమాఫీపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి జగన్ ను ప్రశ్నించారు. తెలుగుదేశం ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు చేయూతపై వేదిక ఏదైనా ఎక్కడైనా బహిరంగ చర్చకు తాను సిద్దమని జగన్ సిద్దమా అంటూ నిలదీశారు.  

ఏపీ ప్రజల పాలిట మహిషాసురుడిలా జగనాసురుడు దాపురించారని మండిపడ్డారు మంత్రి పరిటాల సునీత. డ్వాక్రా రుణాలపై అవమానకరంగా మాట్లాడిన జగన్ కోటిమంది డ్వాక్రా మహిళలను అవమానించారని ధ్వజమెత్తారు. పసుపు కుంకుమ పథకం అవహేళన చేస్తూ జగన్ మాట్లాడటం ఆయన రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. మరో పదిరోజుల్లో డ్వాక్రా మహిళల బ్యాంకు ఖాతాల్లోకి తుది విడత పసుపు కుంకుమ నిధులు జమ అవుతాయని స్పష్టం చేశారు. 

ఏపీ పాలిట మహిషాసురుడుగా ఉన్న జగన్ కు తగిన గుణపాఠం చెప్పనున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో జగనాసురుడును మర్ధించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మంత్రి పరిటాల సునీత స్పష్టం చేశారు.  
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి