కృష్ణా జిల్లాలో కొన్ని పంచాయితీలు ఏకగ్రీవం కాగా అందులో అత్యధిక చోట్ల వైసిపి అభ్యర్థులే వున్నారు.
విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ఓవైపు కొనసాగుతుండగానే మరోవైపు కొన్ని పంచాయితీలకు సర్పంచ్ లు, వార్డు మెంబర్లు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏకగ్రీవాలు కొనసాగుతున్నాయి. ఈ ఏకగ్రీవాల్లో అధికార వైసిపి బలపర్చిన అభ్యర్ధులే ఎక్కువగా ఎన్నికవుతున్నారు. ఇలా కృష్ణా జిల్లాలో కూడా కొన్ని పంచాయితీలు ఏకగ్రీవం కాగా అందులో అత్యధిక చోట్ల వైసిపి అభ్యర్థులే వున్నారు.
జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలోని రామచంద్రునిపేట గ్రామపంచాయితీలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మద్దుల రామకృష్ణ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే వత్సవాయి మండలం మక్కపేట పంచాయితీ గుడేటి సారమ్మ, భీమవరంలో బీమల సుజాత, నందిగామ మండలంలోని మాగల్లులో గుంటి ఆశాజ్యోతి ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నికయ్యారు. వీరంతా అధికార వైసిపి బలపర్చిన అభ్యర్థులే.
undefined
ఏకగ్రీవమమైన పంచాయితీల వివరాలివి...
చందర్లపాడు పరిధిలో పొక్కునూరు, గుగ్గుళ్లపాడు
జి కొండూరు పరిధిలో వెంకటాపురం, కందులపాడు, సున్నంపాడు
జగ్గయ్యపేట పరిధిలో రామచంద్రునిపేట
కాకిపాడు పరిధిలో నెప్పల్లి, మద్దూరు, కాసరానేనివారి పాలెం
మైలవరం పరిధిలో సీతారాంపురం తాండా
నందిగామ పరిధిలో కేతవీరునిపాడు, మాగల్లు
తోట్లవల్లూరు పరిధిలో యేకమూరు, దేవరపల్లి, గుర్విందపల్లి, కనకవల్లి
వీరుల్లపాడు పరిధిలో గోకరాజుపల్లి,వెల్లంకి, చెత్తన్నవరం
విజయవాడ రూరల్ పరిధిలో గూడవల్లి, ప్రసాదంపాడు
వత్సవల్ పరిధిలో మక్కపేట, భీమవరం