నెల్లూరులో దారుణం.. ప్రేమకు ఒప్పుకోలేదని యువతి గొంతు కోసిన ప్రేమోన్మాది..

By SumaBala Bukka  |  First Published Mar 21, 2022, 11:50 AM IST

ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. ప్రేమించడానికి ఒప్పుకోలేదని యువతి గొంతు కోసి.. తాపీగా వెళ్లి కల్లు తాగి ఇంట్లో పడుకున్నాడు. ఈ దారుణమైన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.  


నెల్లూరు : Nellore వెంకటగిరిలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. Inter student చిగురుపాటి Jyothikaను ప్రేమించలేదనే కోపంతో చెంచుకృష్ణ అనే యువకుడు కత్తితో గొంతు కోశాడు. జ్యోతిక పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెంచుకృష్ణను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

చెంచుకృష్ణ కొంతకాలంగా ప్రేమించాలంటూ యువతి వెంటపడుతున్నాడు. దీనికి ఆ యువతి అంగీకరించకపోవడంతో నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని ఆ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు.  ప్రేమించలేదని యువతి గొంతు Choked చేశాడు. వివరాల్లోకి వెడితే.. పట్టణంలోని కాలేజీమిట్టకు చెందిన చిగురుపాటి జ్యోతిని (17) గత కొంత కాలంగా ప్రేమించాలంటూ చెంచు కృష్ణ అనే యువకుడు వేధిస్తున్నాడు. 

Latest Videos

undefined

విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు యువకుడిని మందలించారు. దీంతో కోపం పెంచుకున్న యువకుడు ఇంట్లో నిద్రిస్తున్న జ్యోతిని చూసి నేరుగా ఇంటిలోకి జోరబడి చాకుతో గొంతు కోశాడు. గొంతు కోసి ఆ తరువాత నింపాదిగా వెళ్లి కల్లు తాగి ఇంట్లోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. కాసేపటికి విషయం తెలుసుకున్న స్థానికులు తలుపులు పగులకొట్టి చెంచుకృష్ణను పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం చెంచు కృష్ణ పోలీసులు అదుపులో ఉన్నాడు. యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

ఇదిలా ఉండగా, బీహార్ లోనూ ఇలాంటి దారుణమే జరిగింది. Biharలో దారుణం జరిగింది. అధికార మదమెక్కిన ఓ 
Sarpanch నీచానికి దిగజారాడు. గ్రామానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లపై Sexual harassmentకు పాల్పడ్డాడు. అంతేకాదు దీన్ని వ్యతిరేకించిందని ఆ ముగ్గురిలో ఓ అమ్మాయి noiseను పదునైన ఆయుధంతో కోసేశాడు. ఈ ఘటన బీహార్‌లోని సుపాల్ జిల్లాలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లోధ్ గ్రామంలో చోటుచేసుకుంది.

ఆ గ్రామ సర్పంచ్ ముస్తాకిన్ తన సొంత గ్రామానికి చెందిన ముగ్గురు బాలికలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ వేదింపులకు వ్యతిరేకంగా ముగ్గురిలోని ఓ బాలిక నిరసన వ్యక్తం చేయడంతో, కోపంతో రగిలిపోయిన సర్పంచ్ పదునైన ఆయుధంతో ఆమె ముక్కును కోసాడు. తీవ్ర రక్తస్రావం జరుగుతుండడంతో గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు సర్పంచ్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కాగా, మరోవైపు సర్పంచ్ కూడా పోలీస్ స్టేషన్ లో బాలికల తల్లిదండ్రులపై ఫిర్యాదు చేశాడు. తనపై, తన మద్దతుదారులపై బాలికల కుటుంబ సభ్యులు దాడి చేశారని ఆరోపిస్తూ సర్పంచ్ పోలీస్ స్టేషన్‌ లో కంప్టైంట్ ఇచ్చాడు. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఓ కర్కశ తండ్రి కన్నకూతుర్లపైనే Sexual assaultకి ప్రయత్నించాడు. హైదరాబాద్ లోని వనస్థలిపురం పరిధిలో ఆలస్యంగా ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… Nalgonda District దేవరకొండలోని ఓ తండాకు చెందిన వ్యక్తి భార్య, ఐదుగురు సంతానం. వారిలో 20, 13, పదకొండేళ్ల కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆటో డ్రైవర్ అయిన అతను మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అతడి కన్ను ఎదిగిన కుమార్తెలపై పడింది. నిత్యం liquor తాగి వచ్చి వారిని లైంగికంగా వేధించసాగాడు. అతడి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు wife ప్రతిఘటించేది.  

అయితే, ఈనెల 17న ఆమెను కొట్టి ఇంటి నుంచి వేరే గ్రామానికి పంపించాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి మొదట తన 13 ఏళ్ల కుమార్తె లైంగిక దాడికి ప్రయత్నించాడు. మిగతా కుమార్తెలు అరవడంతో భయపడిన అతడు ఇంటి గేటుకు తాళం వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్క చెల్లెలు అక్కడినుంచి తప్పించుకుని షీ టీమ్ కు, పోలీసులకు ఫోన్ చేశారు.

click me!