చంద్రబాబు ఆదేశాలను పాటించారు: మండలి చైర్మన్ పై ఉమ్మారెడ్డి

By telugu teamFirst Published Jan 23, 2020, 1:15 PM IST
Highlights

శాసన మండలి చైర్మన్ టీడీపీ కార్యకర్తలా చంద్రబాబు ఆదేశాలను పాటించారని వైసీపీ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. శాసన మండలి చైర్మన్ గా షరీఫ్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన అన్నారు.

అమరావతి: శాసన మండలి చైర్మన్ క్షమించరాని నేరం చేశారని చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. సభను రాజ్యాంగానికి అనుగుణంగా నడపడం చేతకానప్పుడు రాజీనామా చెయ్యాలని ఆయన అన్నారు. విచక్షణాధికారాన్ని సభలో డోలాయమాన పరిస్థితి నెలకొన్నప్పుడు వాడాలిగానీ ఇలా నిబంధనలను అతిక్రమించడానికి వాడకూడదని ఆయన అన్నారు.

చైర్మన్ రాజ్యాంగాన్ని, మండలి నిబంధనలను, కౌల్ అండ్ శక్తర్ ని ఉల్లఘించారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బిల్లులను అసలు సెలెక్ట్ కమిటీ కి పంపడానికి ఆస్కారమే లేదని ఆయన అన్నారు. చైర్మన్ టీడీపీ కార్యకర్తలా చంద్రబాబు ఆదేశాలను అమలు చేశారని విమర్శించారు. 

Also Read: మండలి రద్దు: అప్పట్లో ఎన్టీఆర్, ఇప్పుడు జగన్ అంతే తేడా..మిగితాదంతా సేమ్ టు సేమ్

సెలెక్ట్ కమిటీని ప్రకటించాలని, సభ ఆమోదం పొందాలని తెలియకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.  చైర్మన్ మొత్తం నిబంధనలను అన్నింటినీ అతిక్రమించారని ఆయన అన్నారు. ఒక్క నిమిషం కూడా చైర్మన్ కి ఆ స్థానం లో ఉండే అర్హత లేదని అన్నారు.

మండలి చైర్మన్ కి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదని శాసన మండలి సభా నాయకుడు, డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తక్షణమే చైర్మన్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. విచక్షణాధికారం పేరుతో అసహ్యంగా వ్యవహరించారని అన్నారు.బిల్లు సెలెక్ట్ కమిటీకి ఇంకా వెళ్ళలేదని ఆయన అన్నారు. 

Also Read: అమరావతి ల్యాండ్ స్కామ్: నిరుపేద రైతు రూ.220 కోట్లతో భూమి కొనుగోలు

చైర్మన్ మళ్ళీ సభని నిర్వహించాలని అన్నారు. సెలెక్ట్ కమిటీ కి పంపాలన్న నిర్ణయంపై ఓటింగ్ జరగకపోతే అది చెల్లదని అన్నారు. అందువల్ల టీడీపీ వాళ్ళు చంకలు గుద్దు కోవడంలో అర్థం లేదని అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత కోల్పోయారని అన్నారు. చంద్రబాబుకి ప్రజాస్వామ్య విలువలు తెలియవని, చట్ట సభలను దారుణంగా అవమానించారని అన్నారు.

click me!