రాజధాని విషయంలో దాఖలైన కేసులను వాదించేందుకు గాను ముకుల్ రోహత్గీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని కేసును రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొంది. ఈ కేసులను వాదించేందుకు దేశంలోనే పేరొందిన మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని ప్రభుత్వం నియమించుకొంది.
Also read:సీఐడీ కేసు:796 తెల్ల రేషన్ కార్డుదారులకు అమరావతిలో భూములు
రోహిత్గీకి ఫీజు కింద రూ. 5 కోట్లు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 22వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పీజులో భాగంగా అడ్వాన్స్‌గా కోటి రూపాయాలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించేందుకు కూడ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడురాజధానులు ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం బిల్లులను ప్రతిపాదించింది. శాసనససభలో ఈ బిల్లు ఆమోదం పొందింది. శాసనమండలి ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపింది.
ఇదిలా ఉంటే సీఆర్‌డీఏ రద్దు , పాలనా వికేంద్రీకరణ బిల్లులపై ఉన్నత న్యాయస్థానంలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ కోసం ప్రభుత్వం తరపున వాదనలను విన్పించేందుకు రోహత్గీని రాష్ట్ర ప్రభుత్వం నియమించుకొంది. రాష్ట్ర రాజధానిపై ఏర్పాటు చేసిన కేసులను వాదించేందుకు రోహిత్గీని నియమించుకొంది ప్రభుత్వం.