తెలుగు సీఎంల జాతకాలు బాగున్నాయి, కానీ ఓ పెద్ద నాయకుడికి ఇబ్బందులు: స్వరూపానందేంద్ర

Published : Apr 13, 2021, 01:52 PM IST
తెలుగు సీఎంల జాతకాలు బాగున్నాయి, కానీ ఓ పెద్ద నాయకుడికి ఇబ్బందులు: స్వరూపానందేంద్ర

సారాంశం

రెండు తెలుగు రాష్ట్రాల సీఎం జాతకాలు బాగున్నాయని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి చెప్పారు.

విశాఖపట్టణం: రెండు తెలుగు రాష్ట్రాల సీఎం జాతకాలు బాగున్నాయని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్రస్వామి చెప్పారు.మంగళవారం నాడు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విశాఖలోని శారదా పీఠంలో  పంచాంగగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.  ఏపీ సీఎం జగన్ జాతకం బాగుందన్నారు. దీంతో ఏపీకి ఈ ఏడాది ఆర్ధికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయన్నారు.  సీఎంలు, పీఎం జాతకాలు బాగుంటే ప్రజలకు ఇబ్బందులు లేకుండా పాలన సాగించేందుకు అవకాశం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఈ ఏడాది సుఖ సంతోషాలతో జీవనం సాగిస్తారని ఆయన చెప్పారు.

ఫ్లవ అంటే చీకటిని పారద్రోలే వెలుగు అనే అర్ధం అని చెప్పారు. శార్వరి, వికారి సంవత్సరాల మాదిరిగా కాకుండా ఫ్లవ నామ సంవత్సరంలో ప్రజలకు ఇబ్బందులు తొలిగిపోతాయన్నారు. గ్రహాల అనుకూలత లేకున్నా మంచి జరుగుతుందని భావిస్తున్నట్టుగా చెప్పారు. ఓ పెద్దనాయకుడికి ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఆయన జోస్యం చెప్పారు. అయితే ఆ నాయకుడు ఎవరనే విషయాన్ని మాత్రం ఆయన చెప్పలేదు.ఉగాదిని పురస్కరించుకొని శారదా పీఠంలో ఇవాళ ఉదయం స్వరూపానందేంద్రస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 

PREV
click me!

Recommended Stories

Road Doctor: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోడ్డు డాక్ట‌ర్‌.. దేశం దృష్టిని ఆక‌ర్షిస్తోన్న స‌రికొత్త సేవ‌లు
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!