హాస్టల్ లో ఉండలేనమ్మా... తల్లితో చెప్పిన పది నిమిషాల్లోనే దారుణం.. !!

By AN TeluguFirst Published Apr 13, 2021, 1:40 PM IST
Highlights

కృష్ణా జిల్లా పెనమలూరులో విషాదం చోటు చేసుకుంది. పోరంకిలోని శ్రీ చైతన్య క్యాంపస్ లో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాను హాస్టల్ లో ఉండలేనని తల్లి చెప్పిన పది నిమిషాలకే ఉరేసుకుని చనిపోవడం అందర్నీ కలిచి వేసింది. 

కృష్ణా జిల్లా పెనమలూరులో విషాదం చోటు చేసుకుంది. పోరంకిలోని శ్రీ చైతన్య క్యాంపస్ లో ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తాను హాస్టల్ లో ఉండలేనని తల్లి చెప్పిన పది నిమిషాలకే ఉరేసుకుని చనిపోవడం అందర్నీ కలిచి వేసింది. 

పెనమలూరు సీఐ ఎం. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన మదన్ మోహన్ రెడ్డి, మంజుల దంపతుల కుమార్తె బట్టి శిరీష(17) పోరంకిలోని శ్రీ చైతన్య సరస్వతీ సౌధంలో ఇంటర్ (బైపీసీ) రెండో సంవత్సరం చదువుతుంది.

ఈ మధ్య ప్రాక్టికల్స్ పూర్తి చేసి తల్లిదండ్రులతో కలిసి ఈ నెల 7న ఇంటికి వెళ్లింది. మళ్లీ  సోమవారం తల్లితో కలిసి పోరంకిలోని కాలేజీకి వచ్చింది. తాను హాస్టల్ లో ఉండలేనని తల్లికి చెప్పింది. అయితే తల్లి ఆమెకు నచ్చజెప్పింది. దీంతో రూమ్ లోకి వెళ్లి వస్తానని చెప్పి అరుంధతి బ్లాక్ రూం.నం. 247లోకి వెళ్లింది.

పది నిమిషాలైనా కూతురు రాకపోవడంతో తల్లి, కాలేజీ యాజమాన్యం రూంలోకి వెళ్లి చూడగా శిరీష చున్నీతో ఫ్యాన్ కు ఉరేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను కిందికి దించి దగ్గర్లోని కామినేని ఆస్పత్రికి తరలించారు.

అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న యువతి తంద్రి మదన్ మోహన్ రెడ్డి హుటాహుటిన సోమవారం కాలేజీకి వెళ్లారు. 

click me!