తిరుమల శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం... టిటిడి ప్రకటన

By Arun Kumar PFirst Published Apr 11, 2021, 2:50 PM IST
Highlights

 ఏప్రిల్ 13వ తేదీ మంగ‌ళ‌వారం శ్రీ ఫ్ల‌వ‌నామ సంవత్సరాదిన ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రపనున్నట్లు టిడిపి వెల్లడించింది. 

తిరుపతి: తిరుమల వెంకటేశ్వర రావు ఆలయంలో ఏప్రిల్ 13వ తేదీ మంగ‌ళ‌వారం శ్రీ ఫ్ల‌వ‌నామ సంవత్సరాదిన ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జ‌రపనున్నట్లు టిడిపి వెల్లడించింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ముందుగా తెల్లవారుజామున 3.00 గంటలకు సుప్రభాతం నిర్వహించి అనంతరం శుద్థి నిర్వహిస్తారు. ఉదయం 6.00 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేస్తారని తెలిపారు. 

ఉదయం 7.00 నుండి 9.00 గంటల నడుమ విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు.

ఉగాది పర్వదినాన్ని పురస్క‌రించుకొని ఏప్రిల్ 13వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే  ‌ఆర్జిత సేవలైన (వ‌‌ర్చువ‌ల్ సేవ‌లు) కళ్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవాల‌ను  టిటిడి రద్దు చేసిందని టిటిడి ప్రజాసంబంధాల అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. 

click me!