కరోనా ఎఫెక్ట్: ట్రిపుల్ ఐటీ విద్యార్ధులకు సెలవులు

By narsimha lodeFirst Published Apr 11, 2021, 2:45 PM IST
Highlights

ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీకి సెలవులు ప్రకటించారు అధికారులు.  కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా గైరెక్టర్ సంధ్యారాణి ప్రకటించారు.


కడప:ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీకి సెలవులు ప్రకటించారు అధికారులు.  కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా గైరెక్టర్ సంధ్యారాణి ప్రకటించారు.ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీలో  పీ2, ఈ3 విద్యార్ధులకు ఆన్ లైన్ క్లాసులో  బోధించనున్నారు. పీ1,ఈ 4 విద్యార్ధులకు ఇడుపులపాయలోని క్యాంపస్ లోనే పాఠాలు బోధిస్తారు.

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో  విద్యార్ధులను కట్టడి చేయడం సాధ్యం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా  అధికారులు తెలిపారు.కరోనా ఉధృతి తగ్గిన తర్వాత ఇడుపులపాయ విద్యార్ధులకు సెలవులను రద్దు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొంటుంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసింది. అయితే రాష్ట్రంలో వ్యాక్సిన్  కొరత అధికారులను వేధిస్తోంది.కరోనాను పురస్కరించుకొని విద్యాసంస్థల్లో ఆన్ లైన్ లోనే పాఠాల బోధనకు విద్యా శాఖ అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు.

ఈ ట్రిపుల్ ఐటీలో 4 వేల మంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు. కరోనా సమయంలో ఒకే క్యాంపస్ లో ఇంత మంది విద్యార్ధులు ఉండడం వల్ల ఒక్కరికి కరోనా సోకినా వేగంగా ఎక్కువ మందికి వ్యాపించే అవకాశం ఉన్నందున ఈ జాగ్రత్తలు తీసుకొన్నట్టుగా అధికారులు తెలిపారు. 
 

click me!