కేసులకు భయపడే.. మోడీ ప్రశ్నించడం లేదు: జగన్‌పై రామ్మోహన్ నాయుడు విమర్శలు

Siva Kodati |  
Published : Apr 11, 2021, 02:43 PM IST
కేసులకు భయపడే.. మోడీ ప్రశ్నించడం లేదు: జగన్‌పై రామ్మోహన్ నాయుడు విమర్శలు

సారాంశం

తిరుప‌తి ఉప ఎన్నిక నేప‌థ్యంలో వైఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు. తిరుపతి ప్రకాశం పార్కులో ప్ర‌చారంలో పాల్గొన్న ఆయ‌న మాట్లాడుతూ...  కేసులకు భయపడే కేంద్ర ప్ర‌భుత్వాన్ని సీఎం జగన్ ప్రశ్నించడంలేదని రామ్మోహన్ నాయుడు విమర్శించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదాను జగన్ అటకెక్కించారని ఎద్దేవా చేశారు. విభజన హామీల‌ అమలు, రైల్వే జోన్ గురించి అడ‌గ‌డం లేద‌ని టీడీపీ ఎంపీ పేర్కొన్నారు. వైఎస్ జగన్ పాల‌న‌లో చాలా సమస్యలు ఉన్నాయని...  రాష్ట్రానికి మంచి జరగాలంటే కేంద్ర స‌ర్కారుని ఎదిరించే వ్యక్తిని తిరుప‌తి ఉప ఎన్నిక‌లో గెలిపించాల‌ని ఆయ‌న విజ్ఞప్తి చేశారు.

Also Read:వైసీపీ గుండెల్లో రైళ్లు.. దొంగ ఓట్లను అడ్డుకోండి: తిరుపతిలో గెలుపు మనదే, చంద్రబాబు వ్యాఖ్యలు

వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఆంధ్ర‌ప్రదేశ్ అభివృద్ధి తిరోగమనంలో సాగుతోందని మండిప‌డ్డారు. గ‌త‌ టీడీపీ హయాంలో చంద్ర‌బాబు నాయుడు ఏపీ  అభివృద్ధి కోసం ఎన్నో మంచి కార్యక్రమాలను ప్ర‌వేశ‌పెట్టార‌ని రామ్మోహన్ నాయుడు గుర్తుచేశారు.

ఏపీని పెట్టుబడులు పెట్టే ఒక హబ్‌గా త‌యారు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేశారని ఆయ‌న చెప్పారు. తిరుపతిని చంద్ర‌బాబు నాయుడు ఒక స్థాయికి తీసుకువచ్చారని ... ఇప్పుడు తిరుపతికి తీరని అన్యాయం జరుగుతోంద‌ని రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

PREV
click me!

Recommended Stories

Chitha Vijay Prathap Reddy: ఫుడ్ కమిషన్ చైర్మన్ కే పంచ్ లు నవ్వు ఆపుకోలేకపోయిన అధికారులు| Asianet
Pawan Kalyan with “Tiger of Martial Arts” Title: టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు| Asianet Telugu