నాపై అతని పెత్తనం వద్దు: ధనుంజయరెడ్డిపై మేకపాటి సంచలనం

Published : Feb 01, 2023, 06:54 PM IST
నాపై అతని పెత్తనం వద్దు: ధనుంజయరెడ్డిపై  మేకపాటి సంచలనం

సారాంశం

పార్టీ పరిశీలకుడు  ధనుంజయరెడ్డిపై  ఎమ్మెల్యే  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  సంచలన ఆరోపణలు  చేశారు.  ధనుంజయరెడ్డి తీరుతో  పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.    

నెల్లూరు: పార్టీ పరిశీలకుడు  ధనుంజయరెడ్డిపై  నెల్లూరు జిల్లా  ఉదయగిరి కి చెందిన  వైసీపీ  ఎమ్మెల్యే  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం నాడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేకు, ప్రభుత్వానికి  మధ్య వారధిగా  పరిశీలకుడు పనిచేయాల్సి ఉంటుందన్నారు. వారధిగా  ఉండాల్సిన  పరిశీలకుడు  చిచ్చు పెడుతున్నారని ఆయన  ఆరోపించారు.  ధనుంజయరెడ్డి  నిర్ణయాల వల్ల   పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుందని  ఆయన  చెప్పారు.  తాను వైఎస్ కుటుంబానికి విధేయుడినని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  చెప్పారు. తనపై  పెత్తనం కుదరన్నారు. ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి  వద్ద ఈ విషయం తేల్చుకుంటానన్నారు. అంతేకాదు  తాను దేనికైనా సిద్దమేనని   మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి  స్పష్టం  చేశారు.  

పార్టీ నేతలను సమన్వయపర్చకుండా గొడవలు   పెంచుతున్నారని  ధనుంజయరెడ్డిపై  ఆయన ఆరోపణలు  చేశారు.   ఈ విషయాన్ని తాను  సీఎం జగన్ దృష్టికి  కూడా తీసుకువచ్చినట్టుగా  చెప్పారు.    ధనుంజయరెడ్డి  టీడీపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని  చెప్పారు.  
 

PREV
click me!