ఏపీలో ఆత్మహత్యలు: వివాహేతర సంబంధంతో వివాహిత బలి, భార్య వేధింపులకు భర్త సూసైడ్

Published : Sep 28, 2021, 02:23 PM IST
ఏపీలో ఆత్మహత్యలు:  వివాహేతర సంబంధంతో వివాహిత బలి, భార్య వేధింపులకు భర్త సూసైడ్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఇద్దరు ఆత్మహత్యలు చేసుకొన్నారు. వివాహేతర సంబంధం భరించలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది.ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకొంది. భార్య వేధింపులు భరించలేక భర్త ఆత్మహత్య చేసుకొన్న ఘటన చిత్తూరు జిల్లాలో జరిగింది.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) రాష్ట్రంలో వేర్వేరు ఘటనల్లో  ఓ వివాహిత, మరో వ్యక్తి మరణించాడు.  చిత్తూరు(chittoor), కృష్ణా (krishna)జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకొన్నాయి.భార్య వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొంటున్నట్టుగా ఓ వ్యక్తి ఫేస్‌బుక్ లైవ్ (face book live)లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకొన్నాడని భార్య ఆత్మహత్య చేసుకొంది.

చిత్తూరు  జిల్లా మదనపల్లిలో (madanapalle) గుంటూరు జిల్లాకి చెందిన ఉదయ బాస్కర్ (uday bhasker)అనే వ్యక్తి ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేసి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లైవ్‌లో చెప్పి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు

ఆరేళ్ల ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన సోని (sony)గుంటూరు జిల్లాకు చెందిన ఉదయ భాస్కర్ పెళ్లి చేసుకున్నాడు.  ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మేనేజర్‌గా పని చేస్తూ మదనపల్లిలోని శేషమహల్ ఏరియాలో భార్యతో కలిసి ఆయన నివాసముంటున్నాడు. అయితే ఉదయ భాస్కర్, సోని ల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. 

తాజాగా 2 రోజులు క్రితం ఉదయ భాస్కర్‌తో గొడవపడి భార్య సోని  పుట్టింటికి వెళ్లిపోయింది భార్య పుట్టింటికి వెళ్లిన తరువాత ఇంటికి చేరుకున్న ఉదయ భాస్కర్  ఫేస్‌బుక్ లైవ్ లో బార్య, ఆమె కుటుంబ సభ్యులు పెడుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు.ఈ వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకొంటున్నట్టుగా ప్రకటించారు.

ఈ విషయాన్ని గమనించిన అతని స్నేహితులు ఉదయ్ భాస్కర్ కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వారు అప్రమత్తమయ్యే లోపే ఉదయ భాస్కర్ ఉరి వేసుకుని ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఉదయ భాస్కర్ మద్యానికి బానిసై తరచూ వేధింపులకు గురి చేసేవాడని, రెండు రోజుల క్రితం కూడా తనను కొట్టడంతోనే పుట్టింటికి వెళ్లానని సోని పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. గతంలోనూ భర్త ఉదయ బాస్కర్ వేధింపులపై వన్‌టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశానని తెలిపింది.

ఇక మరో ఘటనలో వివాహిత ఆత్మహత్య చేసుకొంది. ఈ ఘటన కృష్ణా జిల్లాలో చోటు చేసుకొంది.  భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని తట్టుకోలేకపోయిన మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. గత సంవత్సరం అక్టోబర్‌లో అంజన్ కృష్ణ, (anjan krishna)రేణుక (renuka) కు వివాహం జరిగింది. అంజన్ కృష్ణతో రేణుకలు వివాహం చేసుకొన్నారు.

పెళ్లైన రెండు నెలల తర్వాత అంజన్ కృష్ణ మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడం మొదలు పెట్టాడు. అది గుర్తించిన భార్య రేణుక భర్తను నిలదీసింది. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రేణుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, భర్త వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని రేణుక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?