Badvel bypoll: మంచి మెజారిటీతో విజయం సాధిస్తామన్న సజ్జల

Published : Sep 28, 2021, 01:20 PM IST
Badvel bypoll: మంచి మెజారిటీతో విజయం సాధిస్తామన్న సజ్జల

సారాంశం

బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ మంచి మెజారిటీతో విజయం సాధిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని  సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

అమరావతి: బద్వేల్ ఉప ఎన్నికల్లో (badvel bypoll) మంచి మెజారిటీతో విజయం సాధిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (sajjala ramakrishna reddy) ధీమాను వ్యక్తం చేశారు. మంగళవారం నాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. బద్వేల్ ఉప ఎన్నికను తాము సీరియస్ గా తీసుకొంటామన్నారు. ప్రతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగానే తీసుకొంటున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.2019 నుండి ప్రజల అభిమానం, ఆదరణ మా పార్టీకే ఎప్పుడూ ఉంటున్నాయని ఎన్నికల ఫలితాలు నిరూపించాయని సజ్జల గుర్తు చేశారు.ప్రతి ఎన్నికల్లోనూ వైఎస్ఆర్‌సీపీకి అభిమానం పెరిగిందని ఆయన చెప్పారు.

తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని  సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.నిష్పక్షపాతంగానే ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటున్నట్టుగా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.చంద్రబాబునాయుడు (chandrababu naidu) సీఎంగా ఉన్న సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో నంద్యాలలో అన్ని రకాల ప్రయత్నాలను టీడీపీ చేసిందని ఆయన విమర్శించారు. ప్రతి ఎన్నికల్లో ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే బద్వేల్ ఉప ఎన్నికల్లో పునరావృతం కానున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్