ఎంపిల పరిస్ధితి ఆందోళనకరం: వరప్రసాద్ ఆసుపత్రికి తరలింపు

First Published Apr 8, 2018, 5:05 PM IST
Highlights
తాజాగా ఆదివారం మధ్యాహ్నం తిరుపతి ఎంపి వరప్రసాద్ ను వైద్యులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.

ప్రత్మేకహోదా కోసం ఏపి భవన్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న వైసిపి ఎంపిల పరిస్దితి ఆందోళనకరంగా మారుతోంది. తాజాగా ఆదివారం మధ్యాహ్నం తిరుపతి ఎంపి వరప్రసాద్ ను వైద్యులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు.

ఇప్పటికే నెల్లూరు ఎంపి మేకపాటి రాజగోపాల రెడ్డి రామ్ మనోహర లోహియా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

వైసిపి ఎంపిల్లో ముగ్గురు అంటే ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డితో కలుపుకుని బిపి, షుగర్ లాంటి సమస్యలున్నాయ్. మూడు రోజులుగా భోజనం లేకపోవటంతో రోజువారీ వేసుకోవాల్సిన మందులు కూడా వేసుకోవటం లేదు. దాంతో బిపి, షుగర్ లెవెల్స్ లో తేడా వచ్చేసింది.

అందుకే ఇద్దరు ఎంపిలు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వైవి సుబ్బారెడ్డి ఆరోగ్యం కూడా విషమిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన మిధున్ రెడ్డి, అవినాష్ రెడ్డి యువకులే కాబట్టి వారికి మాత్రం ఎటువంటి అనారోగ్య సమస్యలు ప్రస్తుతానికి లేనట్లే.

చూడబోతే మరో రెండు, మూడు రోజుల్లో కేంద్రప్రభుత్వం ఎంపిల దీక్షను బలవంతంగా విరమింపచేసేట్లే కనబడుతోంది.

 

 

 

 

 

 

 

 

click me!