పవన్ మంగళగిరి పర్యటనలో అపశృతి.. కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీ, తృటిలో తప్పిన ప్రమాదం

Siva Kodati |  
Published : Sep 29, 2021, 04:08 PM IST
పవన్ మంగళగిరి పర్యటనలో అపశృతి.. కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీ, తృటిలో తప్పిన ప్రమాదం

సారాంశం

పవన్ కాన్వాయ్ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం సమీపంలోకి రాగానే... వాహనశ్రేణిలోని రెండు కార్లు ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు పవన్ . ఆయన కాన్వాయ్ మంగళగిరిలోని డీజీపీ కార్యాలయం సమీపంలోకి రాగానే... వాహనశ్రేణిలోని రెండు కార్లు ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది.

మరోవైపు జనసేన, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే. సినీరంగ సమస్యలను ప్రస్తావిస్తూ వైసీపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో పవన్ పై మంత్రి పేర్ని నాని విరుచుకుపడ్డారు. దీనికి తోడు సినీ నటుడు పోసాని కూడా పవన్ పై విమర్శలు గుప్పించడం, జగన్ ను ఏమైనా అంటే ఊరుకోబోమని హెచ్చరించడం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ కృష్ణా, గుంటూరు జిల్లాల పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు