‘పోసాని భార్యపై వ్యాఖ్యలా?.. పవన్ కల్యాణ్ నీ దాడులు ఎంతో కాలం సాగవు..’ లక్ష్మీ పార్వతి ఫైర్...

Published : Sep 29, 2021, 01:38 PM IST
‘పోసాని భార్యపై వ్యాఖ్యలా?.. పవన్ కల్యాణ్ నీ దాడులు ఎంతో కాలం సాగవు..’ లక్ష్మీ పార్వతి ఫైర్...

సారాంశం

బాబులాగే ఇటువంటి హీనరాజకీయాలకు వారసత్వంగా మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తూ పవన్ కల్యాణ్ సాగిస్తున్న దాడులు ఎంతో కాలం సాగవు. మీ ఇంటి స్త్రీలను అవమానపరిచిన అదే టీడీపీతో కలిసి పనిచేస్తూ విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఈ అరాచకాలు సహించలేనివి. ఎంతో ఉత్తమురాలు, ఏనాడు బయటకు రాని పోసాని భార్యను మీరు అవమానించడం అంటే మీరు ఏ స్థితికి దిగజారిపోయారో ఆలోచించుకోండి. ముగింపు తొందరలోనే ఉంది. భగవంతుడే మీకు బుద్ది చెబుతాడు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

‘పోసాని భార్యపై నీచమా?.. పవన్ కల్యాణ్ నీ దాడులు ఎంతో కాలం సాగవు..’ లక్ష్మీ పార్వతి ఫైర్...
Lakshmi Parvathi Comments On Chandrababu, Pawan Kalyan over Posani Issue

Lakshmi Parvathi, Comments, Chandrababu, Pawan Kalyan, Posani Krishna Murali, Nara Lokesh Babu

విజయవాడ : మహిళల ఆత్మ గౌరవాన్ని దిగజార్చిన హీనుడు చంద్రబాబు (Chandrababu) అంటూ తెలుగు-సంస్కృత అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి (Lakshmi Parvathi) ఫైర్ అయ్యారు. పోసాని మురళి (Posani Krishna Murali)భార్యకు జరిగిన అవమానం చూశాక మాట్లాడకుండా ఉండటం మానవత్వం కాదు. నీచనికృష్ణ రాజకీయ చదరంగం ప్రారంభించి, చివరకు సంస్కార హీనుల్ని తయారుచేసి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే స్థాయికి తెలుగు దేశాన్ని దిగజార్చిన హీనుడు చంద్రబాబు. 

బాబులాగే ఇటువంటి హీనరాజకీయాలకు వారసత్వంగా మహిళల వ్యక్తిత్వాలను కించపరుస్తూ పవన్ కల్యాణ్ సాగిస్తున్న దాడులు ఎంతో కాలం సాగవు. మీ ఇంటి స్త్రీలను అవమానపరిచిన అదే టీడీపీతో కలిసి పనిచేస్తూ విలువలకు తిలోదకాలు ఇచ్చారు. ఈ అరాచకాలు సహించలేనివి. ఎంతో ఉత్తమురాలు, ఏనాడు బయటకు రాని పోసాని భార్యను మీరు అవమానించడం అంటే మీరు ఏ స్థితికి దిగజారిపోయారో ఆలోచించుకోండి. ముగింపు తొందరలోనే ఉంది. భగవంతుడే మీకు బుద్ది చెబుతాడు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 

ఇదిలా ఉండగా, రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేగిన సంగతి తెలిసిందే. దీనిపై ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు పవన్‌కు మద్దతుగా వుంటే.. మరికొందరు మాత్రం సైలెంట్‌గా వున్నారు. కానీ పోసాని కృష్ణమురళీ మాత్రం.. రియాక్ట్ అయ్యారు. తన అభిమాన నాయకుడు జగన్‌ను పవన్ అనరాని మాటలు అన్నారంటూ మీడియా ముందుకు వచ్చారు. నిన్న పవన్‌పై పోసాని వ్యాఖ్యలు చేశారు. దీంతో పోసానిపై పవన్ అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కృష్ణమురళీ హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మంగళవారం మీడియాతో మాట్లాడారు. 

పవన్ కల్యాణ్ పెంచుకుంటున్న స్పెషల్ ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారని, వారంతా సైకోలుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తన ఫోన్‌కు వేలాది మెసేజీలు అందుతున్నాయని, బూతులు తిడుతున్నారని చెప్పారు. గ్యాప్ లేకుండా మెసేజీలు పంపిస్తున్నారని పోసాని అన్నారు. కుటుంబ సభ్యుల జోలికి వెళ్లొద్దంటూ పవన్ కల్యాణ్.. ప్రెస్ మీట్ పెట్టి.. తన అభిమానులకు పవన్ కల్యాణ్ ఒక స్పష్టమైన సందేశం ఇవ్వకపోతే తానూ కుటుంబ సభ్యుల జోలికి వెళ్తానని అన్నారు.

నా భార్యను లాగుతారా, అదే జరిగితే మీ ఇంట్లో స్త్రీలపై నేనూ మాట్లాడుతా.. పవన్ కు పోసాని హెచ్చరిక

పవన్ కల్యాణ్‌కు కూడా ఒక కుమార్తె ఉందని, రేప్పొద్దున ఎవరైనా ఆమెను ఏమైనా అంటే ఆయన బాధపడరా? అని పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు. తాను బతికే ఉంటానని, పవన్ కల్యాణ్‌కు రక్త కన్నీరు తప్పదని జోస్యం చెప్పారు. నీ ఇంట్లో ఉండే వాళ్లే ఆడవాళ్లా? మా ఇంట్లో ఉండే వాళ్లు ఆడవాళ్లు కాదా? అని నిలదీశారు. తన భార్యను బజారుకు ఈడుస్తూ పవన్ కల్యాణ్ సైకో ఫ్యాన్స్ చేస్తోన్న మెసేజీలు వెంటనే ఆగకపోతే.. తాను కూడా పవన్ కల్యాణ్ ఇంట్లో ఆడవాళ్లను రోడ్డుకు ఈడ్చేలా తిడతానని పోసాని హెచ్చరించారు.

ఇదే సమయంలో పోసాని మాట్లాడుతున్న సమయంలో ఓ విలేకరి అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆయన మీద కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన భార్యా, బిడ్డలను పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ బజారుకు ఈడ్చేలా వ్యాఖ్యలు చేస్తోన్న విషయాన్ని తాను బయటికి చెప్పుకోవడానికి వచ్చానని పోసాని కృష్ణ మురళి స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ తన మీద, తన కుటుంబ సభ్యుల మీద ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారో.. చెప్పుకోవడం వ్యక్తిగతం కాదని అన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu