పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు: పేర్ని నానితో నిర్మాత దిల్ రాజు భేటీ

Siva Kodati |  
Published : Sep 29, 2021, 02:46 PM IST
పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు: పేర్ని నానితో నిర్మాత దిల్ రాజు భేటీ

సారాంశం

ఏపీ మంత్రి పేర్నినానితో నిర్మాత దిల్ రాజ్ మచిలీపట్నంలో భేటీ అయ్యారు.  ప్రభుత్వ టిక్కెట్ల విక్రయం, సినిమా రంగం అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరగనుంది. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో దిల్‌రాజు.. పేర్ని భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. 

రిపబ్లిక్ సినిమా ప్రీ రీలిజ్ ఈవెంట్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపుతుందో కొత్తగా చెప్పనక్కర్లేదు. దీనిపై రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు పోసాని ప్రెస్‌మీట్లు, ఏపీ మంత్రుల కౌంటర్లలో సినీ, రాజకీయ వర్గాల్లో పవన్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అయితే నిన్న పోసాని చేసిన వ్యాఖ్యలు మాత్రం శృతిమించాయి. తన కుటుంబంలోని ఆడవాళ్లను ఈ వ్యవహారంలోకి లాగితే.. తాను మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయాల్సి వస్తుందని కృష్ణమురళీ హెచ్చరించారు. దీనిపై నిన్న జనసేన కార్యకర్తలు ప్రెస్‌క్లబ్ వద్ద నిరసన నిర్వహించారు. ఆ వెంటనే  తర్వాతి రోజు మెగా బ్రదర్ నాగబాబు తనదైన శైలిలో పోసానికి కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ నటించిన సమరసింహారెడ్డి మూవీలోని ‘‘కుక్క మొరిగింది’’ అన్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు.

ఇక నాటి స్పీచ్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ వైపు కన్నెత్తి చూసినా కాలిపోతావంటూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఏపీ మంత్రులు సైతం అదే స్థాయిలో పవన్‌పై విరుచుకుపడ్డారు. నేను సన్నాసిని అయితే.. నువ్వు సన్నాసిన్నర అంటూ పేర్ని నాని శివాలెత్తారు. అటు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం పవన్ వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పేసింది. ఈ క్రమంలో ఏపీ మంత్రి పేర్నినానితో నిర్మాత దిల్ రాజ్ మచిలీపట్నంలో భేటీ అయ్యారు.  ప్రభుత్వ టిక్కెట్ల విక్రయం, సినిమా రంగం అంశాలపై వీరిద్దరి మధ్య చర్చ జరగనుంది. ఏపీ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో దిల్‌రాజు.. పేర్ని భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu
CM Chandrababu: జిల్లా కలెక్టర్లే ప్రభుత్వానికిబ్రాండ్ అంబాసిడర్లు: బాబు | Asianet News Telugu