విశాఖ ఆర్కే బీచ్‌లో ఇద్దరు విద్యార్థుల గల్లంతు..

Published : Oct 19, 2023, 12:08 PM IST
విశాఖ ఆర్కే బీచ్‌లో ఇద్దరు విద్యార్థుల గల్లంతు..

సారాంశం

విశాఖపట్నంలోని ఆర్కే  బీచ్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం బీచ్‌కు వచ్చిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు.

విశాఖపట్నంలోని ఆర్కే  బీచ్ వద్ద విషాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం బీచ్‌కు వచ్చిన ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. సముద్ర తీరాన ఈత కొడుతున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఇతర సిబ్బంది అక్కడికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థులలో ఒకరిని కోన ఊపిరితో ఉన్న స్థితిలో బయటకు తీసుకొచ్చారు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు. అతడిని హర్షగా గుర్తించారు. 

మరో విద్యార్థి రాజ్‌కుమార్ కోసం గాలింపు కొనసాగుతుంది. ఇద్దరు విద్యార్థులు కూడా ఎన్నారై కాలేజ్‌లో ఇంటర్మీడియట్  చదువుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో బాధిత విద్యార్థుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు