ప్లంజ్ పూల్ వద్ద రెండు గుంతలు:శ్రీశైలం డ్యామ్ కు ముప్పు?

Published : Oct 30, 2020, 10:48 AM IST
ప్లంజ్ పూల్ వద్ద రెండు గుంతలు:శ్రీశైలం డ్యామ్ కు ముప్పు?

సారాంశం

శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ లో భారీగా గుంతలు ఏర్పడినట్టుగా అధికారులు గుర్తించారు. ప్రాజెక్టు 6, 8 గేట్ల ముందు భారీగా గొయ్యి ఏర్పడిన విసయాన్ని అధికారులు గుర్తించారు. వీటిని పూడ్చకపోతే డ్యామ్ కు ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


శ్రీశైలం: శ్రీశైలం డ్యామ్ ప్లంజ్ పూల్ లో భారీగా గుంతలు ఏర్పడినట్టుగా అధికారులు గుర్తించారు. ప్రాజెక్టు 6, 8 గేట్ల ముందు భారీగా గొయ్యి ఏర్పడిన విసయాన్ని అధికారులు గుర్తించారు. వీటిని పూడ్చకపోతే డ్యామ్ కు ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

also read:కృష్ణా నదికి భారీ వరద: 11 ఏళ్లలో ఇదే రికార్డు

ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో వరద నీరు ఈ గొయ్యిల ద్వారా దిగువకు చేరుతోంది. అయితే ఈ రకంగా వరద నీరు కిందకు చేరకుండా ఉండేందుకు గాను 2002లో కాంక్రీట్ వేశారు. అయితే ఇటీవల కాలంలో ప్రాజెక్టుకు వచ్చిన వరద కారణంగా కాంక్రీట్ కొట్టుకుపోయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.

ప్రస్తుతం ఏర్పడిన గొయ్యిలను వెంటనే పూడ్చకపోతే  డ్యామ్ వైపు గుంతలు డ్యామ్ వైపు విస్తరించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ గోతులను పూడ్చడంతో పాటు ఇతర మరమ్మత్తులకు గాను సుమారు రూ. 900 కోట్లు అవసరమౌతోందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇటీవల కాలంలో కురుస్తున్న వర్షాల కారణంగా డ్యామ్ సమీపంలో కొండచరియలు విరిగి పడుతున్న విషయం తెలిసిందే. గత మాసంలోనూ అంతకుముందు మాసంలో కూడ ఇదే రకంగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే.

శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఏర్పడిన గుంతలను పూడ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకొనేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే