నెల్లూరులో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం: ఇద్దరు మృతి, చావు బతుకుల్లో ఒకరు

Published : Sep 23, 2021, 10:44 AM IST
నెల్లూరులో ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్యాయత్నం: ఇద్దరు మృతి, చావు బతుకుల్లో ఒకరు

సారాంశం

నెల్లూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో మరొకరు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. దొరవారిసత్రం మండలం మోదుగులపాలెనికి చెందిన మురళి, మస్తానమ్మ, కావ్య పురుగుల మందు తాగారు. మురళి, మస్తానమ్మలు మరణించారు.

నెల్లూరు: నెల్లూరు(nellore) జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. జిల్లాలోని దొరవారిసత్రం (doravarisatram) మండలం మోదుగులపాలెంలో(modugulapalem) ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు  ఆత్మహత్యాయత్నం చేశా,రు. వీరిలో ఇద్దరు మరణించగా, మరొకరు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. 

మోదుగులపాలెం గ్రామానికి చెందిన మురళి (murali)అతని తల్లి మస్తానమ్మ(mastanamma), కూతురు కావ్య(kavya)లు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు మురళిని, కావ్యను ఆసుపత్రికి తరలించారు.

ఆసుపత్రికి తరలించేలోపుగాను మస్తానమ్మ ఇంట్లోనే మృతి చెందింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మురళి మరణించాడు. ఆసుపత్రిలో కావ్య చికిత్స పొందుతుంది. చావు బతుకుల మధ్య కావ్య కొట్టు మిట్టాడుతోందని వైద్యులు చెప్పారు.కుటుంబ కలహాలతోనే మురళి కుటుంబం  ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. మురళికి అతని భార్యతో విబేధాలున్నాయని  పోలీసులు చెబుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?