జగన్ కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు నిచ్చిన సిబిఐ కోర్టు...

By AN TeluguFirst Published Sep 23, 2021, 10:39 AM IST
Highlights

అనంతపురంలోని వాన్‌పిక్ ప్రాజెక్టులు, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు సంబంధించిన కేసుల్లో జగన్ బుధవారం సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో కీలక సమావేశంలో పాల్గొనవలసి ఉన్నందున బుధవారం బిజీ షెడ్యూల్ ఉందని, హాజరు కాలేకపోయానని జగన్ తన న్యాయవాది ద్వారా విజ్ఞప్తి చేశారు. 

హైదరాబాద్ : మనీలాండరింగ్ నిరోధక చట్టం (Prevention of Money Laundering Act) కింద దాఖలైన కేసులను విచారించూ హైదరాబాద్‌లోని సిబిఐ కోర్టు (CBI court) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై. జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan) చేసిన విజ్ఞప్తిని అంగీకరించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate)తనపై దాఖలు చేసిన క్విడ్-ప్రో-కో కేసుల(Quid pro quo Cases)లో తన హాజరును మినహాయించాలని(Exemption) కోరిన జగన్ విన్నపాన్ని ఓకే చేసింది.

అనంతపురంలోని వాన్‌పిక్ ప్రాజెక్టులు, లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు సంబంధించిన కేసుల్లో జగన్ బుధవారం సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారులతో కీలక సమావేశంలో పాల్గొనవలసి ఉన్నందున బుధవారం బిజీ షెడ్యూల్ ఉందని, హాజరు కాలేకపోయానని జగన్ తన న్యాయవాది ద్వారా విజ్ఞప్తి చేశారు. కోర్టు అతని అభ్యర్థనను అంగీకరించింది.  అయితే, ఈ కేసుల్లో నిందితులుగా ఉన్న ఇతరులు - విజయసాయి రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, గీతారెడ్డి.. ఇతరులు కోర్టుకు హాజరయ్యారు.

మీరు స్పీకర్ పోడియం ఎక్కింది మరిచారా..?: ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ కు టిడిపి ఎమ్మెల్యే లేఖ

మరొక కేసులో, టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజ్ఞప్తిని సిబిఐ కోర్టు అంగీకరించలేదు. తనపై నమోదైన ఆరోపణలపై తన వాదనలు వినిపించాల్సిన ఇందు-టెక్ జోన్‌కు సంబంధించి సిబిఐ దాఖలు చేసిన కేసును వాయిదా వేయడానికి సుబ్బారెడ్డి. తనపై ఉన్న ఈ కేసును రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు సిబిఐ కోర్టు కేసును వాయిదా వేయాలని సుబ్బారెడ్డి కోరారు.

టిటిడి ఛైర్మన్ అభ్యర్థనను సిబిఐ కోర్టు అంగీకరించలేదు. సుబ్బారెడ్డికి హైకోర్టు నుండి స్టే ఉత్తర్వులు పొందాలి లేదా కేసులో తన వాదనలను సమర్పించాలి అని కోర్టు స్పష్టం చేసింది.

click me!