ఓ మహిళ ఇద్దరు వ్యక్తులతో ఒకేసారి వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది. వారిద్దరూ ఒకే సమయంలో ఆమె ఇంటికి రావడంతో జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి హత్య జరిగింది.
కృష్ణా జిల్లా : Krishna District తోట్లవల్లూరు మండలం అల్లవారిపాలెంలో గ్రామంలో దారుణ murder జరిగింది. పోలీసుల ప్రాథమిక విచారణలో extramarital affair హత్యకు కారణమని గుర్తించారు. యకునూరు గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డికి అల్లవారిపాలెంకు చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. అదలా కొనసాగుతుండగా.. సదరు మహిళకు గత కొంత కాలంగా అల్లవారిపాలెంకు చెందిన మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం ఏర్పడింది. అది కూడా ఆమె కొనసాగిస్తుంది. ఒకరికి తెలియకుండా, ఒకరితో ఇద్దరితోనూ సంబంధం నడుపుతోంది.
undefined
ఈ క్రమంలో సోమవారం రాత్రి ఒకే సమయంలో.. ఒకరికి తెలియకుండా, మరొకరు ఇద్దరూ మహిళా ఇంటికి రావడంతో.. విషయం బయటపడింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ వివాదం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఇరువురు మధ్య జరిగిన ఘర్షణలో శ్రీనివాసరెడ్డి హత్యకు గురైనట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. హత్య స్థలాన్ని గుడివాడ డిఎస్పి సత్యానందం పరిశీలించారు. కాగా హత్యకు కారణంగా భావిస్తున్న వ్యక్తితో పాటు, వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళా పరారీలో ఉన్నారు. కేసు నమోదు చేసిన తోట్లవల్లూరు పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉండగా, జూలై 22న విశాఖపట్నంలో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. 18 ఏళ్ల వయసున్న మైనర్ ప్రియుడితో కలిసి భర్తను కుక్కర్ తో కొట్టి హత్య చేసింది ఓ మహిళ. విశాఖపట్నంలోని మధురవాడలో బుడుమూరు మురళి పదేళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లాకు చెందిన మృదుల అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. మురళి సౌత్ ఆఫ్రికాలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు. భర్త ఇంటికి దూరంగా ఉంటుండడంతో మృధులకు.. శంకర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడి, ఏడాదికాలంగా సన్నిహిత సంబంధం కొనసాగుతోంది. ఈ ఏడాది జనవరికి శంకర్ కి 18 ఏళ్లు నిండాయి.
ఈ విషయం తెలిసిన భర్త ప్రశ్నించడంతో.. అతని మీద వేధింపుల కేసు కూడా పెట్టింది. ఈ దశలో ఈ నెల 9వ తేదీన మురళి సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చాడు. భార్య వ్యవహారంపై ముందునుంచే మురళికి అనుమానం ఉండడంతో కుటుంబ సభ్యులకు తనకు ప్రాణహాని ఉందని చెప్పేవాడు. ఈనెల 9వ తేదీన విశాఖ వచ్చిన మురళి 11వ తేదీన తల్లి వద్దకు వెళ్లాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలోనే మృదుల 60 రోజుల పాటు భర్త మురళి విశాఖపట్నంలోనే ఉంటాడని, దీనివల్ల తామిద్దరం కలిసే అవకాశం ఉండదని శంకర్ తో చెప్పింది. అంతకాలం దూరంగా ఉండలేమని భర్తను హత్య చేస్తే జీవితకాలం కలిసి ఉండవచ్చని శంకర్ మృధులకు చెప్పాడు.
ఆ ప్రకారం వీరిద్దరూ ఇంట్లో నిద్రపోతున్న భర్తని చంపేయాలని నిర్ణయించుకున్నారు. అలా భర్త నిద్రపోతుండగా కుక్కర్ తో తలపై చితకబాదింది భార్య. వీరిద్దరూ కలిసి ప్రాణం పోయేంతవరకు మురళిని తీవ్రంగా కొట్టారు. ఆ తరువాత మృతదేహాన్ని మూటగట్టి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మారికవలస గడ్డలో స్కూటీపై వెళ్లి పడేశారు. రజకుల బట్టల మూటగా నమ్మించే రీతిన మృతదేహాన్ని దుప్పట్లో కట్టేశారు. మూడు రోజుల తర్వాత మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో రాత్రి ప్రియుడు, మృదుల వెళ్లి పెట్రోలు పోసి నిప్పంటించారు. అయితే ఇంటికి వస్తాను అన్న కొడుకు రాకపోవడంతో తల్లి ఆందోళన చెందింది. ఆమె కోడలిని దీనమీదప్రశ్నించడంతో.. భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల విచారణలో నిజం బయటపడింది.