శ్రీసత్యసాయి జోగన్నపేటలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి, 11 మందికి గాయాలు

Published : Aug 17, 2023, 09:34 AM IST
శ్రీసత్యసాయి  జోగన్నపేటలో  రోడ్డు ప్రమాదం: ఇద్దరు మృతి, 11 మందికి గాయాలు

సారాంశం

శ్రీసత్యసాయి జిల్లాలో ఇవాళ  రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో  ఇద్దరు మృతి చెందారు. మరో 11 మంది గాయపడ్డారు. కారు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

అనంతపురం: శ్రీసత్యసాయి  జిల్లాలో  గురువారంనాడు జరిగిన  రోడ్డు ప్రమాదంలో  ఇద్దరు  మృతి చెందారు.  మరో 11 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని అనంతపురం  ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  శ్రీసత్యసాయి జిల్లా  నల్లచెరువు మండలం జోగన్నపేట లో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో  ఇద్దరు మృతి చెందారు.  మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన వారిని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

దేశంలోని  పలు ప్రాంతాల్లో  ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో  రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  రోడ్డు ప్రమాదాల నివారణకు  ఆయా ప్రభుత్వాలు  అనేక చర్యలు తీసుకున్నప్పటికీ ప్రమాదాలు తగ్గడం లేదు.   డ్రైవర్ల నిర్లక్ష్యం,అతి వేగం,  రోడ్లు సరిగా లేకపోవడం వంటి కారణాలతో   ప్రమాదాలు జరుగుతున్నాయనే  అభిప్రాయాలను  అధికారులు వ్యక్తం  చేస్తున్నారు.ఈ నెల  16న గుజరాత్ రాష్ట్రంలోని భరూచ్  జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు.  రెండు కార్లు ఢీకొనడంతో  ఈ ప్రమాదం జరిగింది.

కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ నెల 13న  జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. అతి వేగంగా  కారు నడపడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని  పోలీసులు చెప్పారు.ఈ నెల  11న తమిళనాడు రాష్ట్రంలోని చెంగల్ ‌పట్టు వద్ద ఓ టిప్పర్ పాదచారులపైకి దూసుకెళ్లింది.  ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  తాడిపత్రి మండలం రావివెంకటపల్లెలో  ఈ నెల  5వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో  ముగ్గురు మృతి చెందారు.

PREV
click me!

Recommended Stories

Bhumana Karunakar Reddy: కూటమి పాలనలో దిగ‌జారుతున్న తిరుమ‌ల ప్ర‌తిష్ట | TTD | Asianet News Telugu
పోలవరం, అమరావతి మాటల్లోనే.. చేతల్లో శూన్యంPerni Nani Slams Alliance Government | Asianet News Telugu