చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి చెందారు.
కుప్పం:చిత్తూరు జిల్లా కుప్పం మండలం పర్తి,చేనులో ఏనుగుల దాడిలో ఇద్దరు మృతి చెందారు. మృతులను శివలింగప్ప, ఉషలుగా గుర్తించారు. తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి నుండి ఏనుగులు కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశించినట్టుగా అటవీశాఖాధికారులు చెబుతున్నారు.
చప్పానికుంటకు చెందిన శివలింగప్పపై ఏనుగులు దాడి చేసి చంపేశాయి. మరో వైపు పంట పొలాల్లో పనిచేస్తున్న ముగ్గురు మహిళలపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడుల్లో ఇద్దరు మహిళలు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కానీ ఉష అనే మహిళ మాత్రం మృతి చెందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాల్లో ఏనుగుల దాడులు తరచుగా చోటు చేసుకుంటున్నాయి. ఏనుగులు పంటపొలాలను కూడా ద్వంసం చేస్తున్న ఘటనలు కూడా లేకపోలేదు.
undefined
2011 జనవరి 13న చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లిస్తున్న సమయంలో అటవీశాఖాధికారిపై ఏనుగులు దాడి చేశాయి. ఈ ఘటనలో అటవీశాఖాధికారి మృతి చెందారు. 2011 మే 6న విజయనగరం జిల్లా కొమరాడ మండలం పాతకలికోటలో ఏనుగులదాడిలో మహిళా రైతు మృతి చెందింది.2020 నవంబర్ 13న విజయనగరం జిల్లా కొమరాడ మండలం పరశురాంపురంలో ఏనుగుల దాడిలో లక్ష్మీనాయుడు మృతి చెందాడు.పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల దాడిలో పరదేశీ అనే రైతు మృతి చెందాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఈ ఘటన చోటు చేసుకుంది.
also read:పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదం: ఏనుగుల దాడిలో రైతు మృతి
2022 మార్చి31న చిత్తూరు జిల్లాలోని సదుంజోగివారిపల్లె పంటపొలాలపై ఏనుగులు దాడి చేశాయి. పంటకు కాపలాగా ఉన్న రైతుపై ఏనుగులు దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.2022 మే 25న చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం పెంగరుగంట పంచాయితీ పరిధిలోని ఇంద్రానగర్ లో పొలం వద్ద ఉన్న రైతుపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో రైతు మృతి చెందాడు.