విజయవాడలో శ్రీలక్ష్మీ మహా యజ్ఞం.. పాల్గొని యజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం జగన్..

Published : May 12, 2023, 09:23 AM ISTUpdated : May 12, 2023, 09:26 AM IST
విజయవాడలో శ్రీలక్ష్మీ మహా యజ్ఞం.. పాల్గొని యజ్ఞ సంకల్పం తీసుకున్న సీఎం జగన్..

సారాంశం

ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ది కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం చేపట్టింది. 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సంక్షేమం, అభివృద్ది కోసం రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం చేపట్టింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ మహా యజ్ఞంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం  జగన్ యజ్ఞ సంకల్పం తీసుకున్నారు. గోశాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కపిల గోవుకు హారతినిచ్చారు. అనంతరం అఖండ  దీపారాధనలో పాల్గొన్నారు. 

ఇదిలా ఉంటే.. ఈ రోజు ఉదయం 5 గంటలకే మహామంగళ వాయిద్య హృద్య నాదం, భగవత్ ప్రీతిగా వేదస్వస్తి, గోపూజ, విఘ్నశ్వర-విష్వక్సేన, పుణ్యాహవచనం, దీక్షాధారణ, అజస్ర దీపారాధన తదితర కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. 

ఇక, 108 గుండాలు, 4 ఆగమనాలు, 500 మంది రుత్వికులతో.. ఈ అష్టోత్తర శతకుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం నిర్వహించనున్నారు. నేటి నుంచి ఆరు రోజుల పాటు.. అంటే ఈ నెల 17 వరకు ఈ యజ్ఞం సాగనుంది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం నేతృత్వంలో యజ్ఞం నిర్వహిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

సీఎం విజయ్ పై పవన్ పంచ్ లు పడిపడి నవ్విన జన సైనికులు | Deputy CM Pawan Kalyan| Asianet News Telugu
Pawan Kalyan Fun: నన్ను తిట్టిన యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి: పవన్ జోకులు| Asianet News Telugu