కల్వర్టును ఢీకొన్న కారు.. మామ, కోడలి మృతి

Published : Sep 14, 2021, 08:42 AM ISTUpdated : Sep 14, 2021, 08:45 AM IST
కల్వర్టును ఢీకొన్న కారు.. మామ, కోడలి మృతి

సారాంశం

ఈ క్రమంలో కోవూరులోని ఏసీసీ కళ్యాణ మండపం వద్దకు రాగానే కారు అదుపుతప్పి.. కల్వర్టును ఢీకొట్టింది. 


నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై సోమవారం అర్థరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..  నెల్లూరులోని హరినాథపురానికి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి కుమారుడిని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్న హాస్టల్ లో చేర్పించి.. తిరుగు పయనమయ్యారు.

ఈ క్రమంలో కోవూరులోని ఏసీసీ కళ్యాణ మండపం వద్దకు రాగానే కారు అదుపుతప్పి.. కల్వర్టును ఢీకొట్టింది. దీంతో.. కారులో ఉన్న ఆ వ్యక్తి తండ్రి పార్లపల్లి సుధాకర్ రావు(76), భార్య అరుణ(30) అక్కడికక్కడే మృతి చెందారు.  ఆ వ్యక్తితో పాటు అతని తల్లి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు  చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఆవర్తనం.. ఈ రెండ్రోజులు ప్రమాదకరమైన వర్షాలు, ఆరు జిల్లాలకు అలర్ట్
Kandula Durgesh: అసెంబ్లీ లో కందుల దుర్గేష్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu